Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనిరుధ్ తో పడగలరా?

అనిరుధ్ తో పడగలరా?

త్రివిక్రమ్-నితిన్ సినిమాకు కొలవరి డి ఫేమ్ అనిరుద్ సంగీత దర్శకుడు అంటూ టాక్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు దేవీతో త్రివిక్రమ్ కంఫర్ట్ గానే వున్నాడు. పైగా అనిరుధ్ కి దేవీకి బడ్జెట్ లో పెద్దగా తేడాకూడా రాదు.

కేవలం వైవిధ్యం కోసమే అనిరుథ్ దగ్గరకు వెళ్లాలని అనుకుంటున్నారేమో? కానీ టాలీవుడ్ వర్గాల బోగట్టా ప్రకారం అనిరుధ్ చాలా బిజీగా వుంటాడని, పైగా అతనికి అంతగా ఫోన్ లు ఎత్తే అలవాటు తక్కువని, మరీ టాప్ పీపుల్ చేస్తే తప్ప ఎత్తడని, అలాంటి వాడితో ఇక్కడ హైదరాబాద్ లో వుండి వర్క్ చేయించుకోవడం అంత సులువు కాదనీ తెలుస్తోంది.

ఇదిలా వుంటే అసలు అనిరుధ్ కు కూడా టాలీవుడ్ లోఎంటర్ అయితే అది పవన్  లేదా మహేష్ సినిమా అయితేనే అన్న ఆలోచన కూడా వుందని తెలుస్తోం ది. నిజానికి ఇంతవరకు నితిన్ కు అనూప్ మంచి మ్యూజిక్ నే ఇస్తూ వచ్చాడు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు తోడయితే ఇంకా మంచి మ్యూజిక్ నే ఇస్తాడు. ఇంతకీ త్రివిక్రమ్ మనసులో ఏముందో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?