Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అంతా త్రివిక్రమే చేసారు?

అంతా త్రివిక్రమే చేసారు?

పైకి ఎవ్వరూ పెదవి విప్పకున్నా, ఇప్పుడు ఇండస్ట్రీలోని పెద్ద హీరోలు, డైరక్టర్లు ఇలాగే ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. విషయం ఏమిటంటే, ఒక్క తివిక్రమ్ కారణంగా హీరోల, డైరక్టర్ల కాంబినేషన్లు అన్నీ మారిపోవాల్సి వచ్చిందట. తివిక్రమ్-పవన్ కళ్యాణ్ సినిమా ఇదిగో అదిగో అంటూ వెనక్కు జరిగి జరిగి ప్రారంభమైంది. పోనీ అక్కడి నుంచి అయినా స్పీడుగా సాగిందా అంటే అదీ లేదు. దీనివల్ల త్రివిక్రమ్ ఫిబ్రవరికి కానీ ఖాళీ కావడం లేదు. పోనీ అలా అని ఊరుకున్నారా అంటే, ఎన్టీఆర్ మీద రుమాలు వేసి వుంచారు.

మహేష్ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేద్దాం అనుకున్న కొరటాల దీంతో, రామ్ చరణ్ వైపు షిప్ట్ అయ్యారు. ఎన్టీఆర్ అక్టోబర్ నుంచి మార్చి వరకు ఖాళీగా కూర్చుంటున్నారు. కొరటాల కూడా మార్చి, ఏప్రియల్ కు కానీ రారు. దాంతో రామ్ చరణ్ బోయపాటి సినిమాకు ఓకె అనాల్సి వచ్చింది. అలా అని త్రివిక్రమ్ కు సమస్య లేదు. ఆయన ఎన్టీఆర్ సినిమా ఫినిష్ చేయడానికీ టైమ్ వుంది. ఆ లోగా మహేష్ - వంశీ పైడిపల్లి సినిమా పూర్తవుతుంది. ఈయన అక్కడికి షిఫ్ట్ అవుతారు. 

కానీ ఎన్టీఆర్ మళ్లీ మరో డైరక్టర్ ను చూసుకోవాలి. ఎందుకంటే కొరటాల-రామ్ చరణ్ ప్రాజెక్టు నుంచి రావడానికి టైమ్ పడుతుంది. అందుకనే ఎన్టీఆర్-విక్రమ్ కుమార్ సంప్రదింపులు మొదలైనట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. నిజానికి అఖిల్ తో చేస్తున్న సినిమా అయిపోయాక, విక్రమ్ కుమార్ తో చేయాలని బన్నీ అనుకన్నాడు. మరి అదేమవుతుందో తెలియదు. 

మొత్తం మీద అంతా అటు ఇటు, ఇటు అటు అయిపోయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?