Advertisement


Home > Movies - Movie Gossip
మొన్న పవన్, బన్నీ.. ఈసారి చరణ్

మెగా కాంపౌండ్ లో ఛాన్స్ దక్కించుకోవడం అంత వీజీ కాదు. తమన్న, సమంత, కాజల్ లాంటి హీరోయిన్లకు పవన్, బన్నీ, చరణ్ తో సినిమాలు చేయడానికి చాలా టైం పట్టింది. అలాంటిది నిన్నగాక మొన్నవచ్చిన అను ఎమ్మాన్యుయేల్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోల్ని కవర్ చేసేసింది. 

పవన్ తో అజ్ఞాతవాసి సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. ఆ మూవీ సెట్స్ పై ఉన్న టైమ్ లోనే బన్నీ సరసన నా పేరు సూర్య సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడీ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వకముందే మరో మెగా హీరో చరణ్ సినిమా ఆఫర్ అందుకుంది. 

బోయపాటి డైరక్షన్ లో రామ్ చరణ్ చేయబోయే సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా ఈ మూవీ ఈమధ్యే లాంఛనంగా ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అను ఎంపికను త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నారు.

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ బెర్త్ కోసం అను ఎమ్మాన్యుయేల్ కు రాశిఖన్నా, రకుల్ గట్టిపోటీ ఇచ్చారు. చెర్రీ, రాశి కాంబినేషన్ కొత్తగా ఉంటుందని కొందరు ఫీల్ అయ్యారు. మరికొందరు సెంటిమెంట్ ప్రకారం చరణ్-రకుల్ ను రిపీట్ చేస్తే బాగుంటుందని భావించారు. కానీ వీళ్లిద్దర్నీ కాదని అను ఎమ్మాన్యుయేల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.