Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ సరసన పవన్ బ్యూటీ?

బన్నీ సరసన పవన్ బ్యూటీ?

మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టడమే కష్టం. ఒకసారి అడుగుపెడితే అవకాశాలు ఆటోమేటిగ్గా వస్తాయి. అందరూ హీరోలే కాబట్టి, ఒక హీరోతో కాకపోతే ఇంకో సినిమాతో సినిమా ఛాన్స్ పట్టేయొచ్చు. గతంలో తమన్న, సమంత లాంటి తారలు ఇదే పని చేశారు. తాజాగా ఇప్పుడు అను ఎమ్మాన్యుయేల్ కూడా మెల్లమెల్లగా మెగా కాంపౌండ్ ను ఆక్రమిస్తోంది.

తన స్టన్నింగ్ లుక్స్ తో ఇప్పటికే టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న అను ఎమ్మాన్యుయేల్ త్వరలోనే బన్నీ సరసన నటించనుంది. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ "నా పేరు సూర్య" అనే సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్.

ఈ సినిమాలో హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయేల్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కల్యాణ్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే.

తెలుగులో మజ్ను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ ఎన్నారై. తర్వాత గోపీచంద్ సరసన ఆక్సిజన్ సినిమా చేసినప్పటికీ అదింకా విడుదల కాలేదు. ఈ గ్యాప్ లో రాజ్ తరుణ్ హీరోగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా చేసింది. ఈ రెండు సినిమాలతో ఏకంగా పవన్ సరసన నటించే అవకాశం అందుకుంది. తాజాగా బన్నీ మూవీ కోసం కూడా అనుకుంటున్నారు.

పవన్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ సెకెండ్ హీరోయిన్. మరి "నా పేరు సూర్య" సినిమాలో ఆమెకు మెయిన్ హీరోయిన్ రోల్ దక్కుతుందా లేక మరోసారి సెకెండ్ హీరోయిన్ గానే ఫిక్స్ అవుతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?