Advertisement


Home > Movies - Movie Gossip
అనుపమతో అంత వీజీ కాదు

'ప్రేమమ్‌' ఫేమ్‌ అనుపమ పరమేశ్వరన్‌ ఇప్పుడు మీడియం రేంజ్‌ చిత్రాలకి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. యువతలో ఆమెకి వున్న క్రేజ్‌ ఎలాంటిదో తెలిసాక నిర్మాతలు ఆమెని సైన్‌ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. అయితే సినిమాల ఎంపికలో అనుపమ చాలా కేర్‌ఫుల్‌గా వ్యవహరిస్తోంది.

'అ ఆ', 'ప్రేమమ్‌' చిత్రాల్లో తను చేసినవి చిన్న పాత్రలే అయినప్పటికీ నటిగా చాలా గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో పాత్ర బలమే తప్ప మరో విషయాన్ని అనుపమ కన్సిడర్‌ చేయడం లేదట. అలాగే ఒకే విధమైన పాత్రలు మళ్లీ మళ్లీ చేయనని గట్టిగా చెబుతోందట.

రీసెంట్‌గా రిలీజ్‌ అయిన 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం ఫ్లాప్‌ అయినా కానీ అనుపమకి మాత్రం మంచి పేరొచ్చింది. నటిగా ఆమె అందరి ప్రశంసలు అందుకుంది. ఈమధ్య తనకి మరో సినిమాలోను చనిపోయే పాత్ర వచ్చిందట. ఉన్నది ఒకటే జిందగీలో తను చేసిన పాత్ర కూడా చనిపోతుంది కనుక మళ్లీ అలాంటిది చేయనని చెప్పిందట.

ఆ చిత్రం చాలా పెద్ద హీరోతో పెద్ద దర్శకుడితో రూపొందుతోన్నది కావడంతో అనుపమ ఇలా రిజెక్ట్‌ చేయడం వారిని చాలా ఆశ్చర్యపరచిందట. అయినప్పటికీ కథల ఎంపికలో జాగ్రత్తగా వుంటానే తప్ప టైప్‌ కాస్ట్‌ అవనని తన అభిప్రాయం వెలిబుచ్చిందట.