Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనుష్క లక్ టర్నింగ్ ఇచ్చుకుంటుందా?

అనుష్క లక్ టర్నింగ్ ఇచ్చుకుంటుందా?

అనుష్క..ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ హీరోయిన్. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఫస్ట్ ఆప్షన్. థర్టీ ప్లస్ కు దగ్గరవుతున్నా కూడా డిమాండ్ తగ్గలేదు. బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి స్పెషల్ సినిమాల ఆమె ఖాతాలో వున్నాయి. అయితే చిరకాలంగా అనుష్క కెరీర్ చూసుకుంటే సరైన హిట్ కనిపించదు. ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మిర్చి మాత్రమే నియరెస్ట్ హిట్. 

అంతకు  ముందు ఆ తరువాత లెక్కించుకుంటే...ఢమరుకం..బ్యాడ్ బాయ్, శకుని(గెస్ట్), వర్ణ, లింగా, తాండవం, రగడ, నాగవల్లి, ఖలేజా, సింగం 2 అన్నీ పెద్దగా ఆడని సినిమాలే. పేరు తెచ్చినా నాన్న, వేదం, వానం (తమిళ వెర్షన్) కూడా అంతంతమాత్రం సినిమాలే. ఇప్పుడు బాహుబలి విడుదలకు రెడీ అవుతోంది. ఫస్ట్ పార్ట్ లో ఆమెది గ్లామర్ పాత్ర కాదని ట్రయిలర్లు చెబుతున్నాయి. మరి ఈ సినిమా అయినా అనుష్క హిట్ ఆశలను నెరవేరుస్తుందేమో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?