Home > Movies - Movie Gossip
అప్పుడు చెర్రీ బిజీ.. ఇప్పుడు కొరటాల బిజీ

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మన దగ్గరకు వచ్చినప్పుడు లైట్ తీసుకుంటే, కొన్ని రోజులకు మనమే వాళ్ల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. చరణ్ విషయంలో ఇప్పుడిదే జరిగింది. మొన్నటివరకు కొరటాలతో సినిమా చేయడానికి ఈ మెగా హీరోకు టైం లేదు, ఇప్పుడు సినిమా చేద్దామని రెడీ అయ్యే టైమ్ కు కొరటాలకు టైం లేదు. దీంతో చరణ్ మరో ప్రాజెక్టును ఫైనలైజ్ చేయాల్సి వచ్చింది.

గతంలో చరణ్-కొరటాల కాంబినేషన్ లో సినిమా ప్రారంభమై ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా జనతా గ్యారేజ్ పెద్ద హిట్ అవ్వడంతో.. కొరటాలను పిలిచి మరీ అవకాశమిచ్చాడు చరణ్. కానీ ఈసారి కొరటాల బిజీ అయిపోయాడు. మహేష్ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే చెర్రీతో సినిమా చేస్తానని చెప్పేశాడు. దీంతో చేసేదేం లేక మణిరత్నం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చెర్రీ. 

సో.. ఇటు మహేష్ తో కొరటాల శివ సినిమా కంప్లీట్ అవ్వాలి. అటు సుకుమార్, మణిరత్నం సినిమాల్ని రామ్ చరణ్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాతే చరణ్-కొరటాల సినిమా పట్టాలపైకి వస్తుంది. ఈలోగా ఇంకెన్ని మార్పులు జరుగుతాయో చూడాలి.