Advertisement


Home > Movies - Movie Gossip
అర్జున్ రెడ్డి-హర్రర్ సినిమా

అసలు పేరు విజయ్ దేవరకొండ అయినా, అర్జున్ రెడ్డి సినిమా తరువాత అతగాడిని అలాగే ఐడెంటిఫై చేస్తున్నారు కామన్ ఆడియన్స్. ఇప్పుడు ఆరు సినిమాలు ఓకె చేసాడు. మూడు సినిమాలు షూట్ లో వున్నాయి. అంత బిజీ విజయ్. అయితే అర్జున్ రెడ్డి తరువాత వచ్చే సినిమా ఏమిటి? బ్యానర్?

గీతాఆర్ట్స్ పతాకంపై, రాహుల్ అనే దర్శకుడు అందిస్తున్న సినిమానే విజయ్ తరువాతి సినిమా. గతంలో ది ఎండ్ అనే సినిమా అందిచాడు ఇతగాడు. ఆ సినిమా పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు. కానీ, బాగానే చేసాడట అన్న టాక్ ఇండస్ట్రీ సర్కిళ్లలోకి వెళ్లింది. దాంతో ఏకంగా గీతాఆర్ట్స్ బ్యానర్ లో అవకాశం వచ్చింది. అదంతా వేరే సంగతి.

అసలు విషయం ఏమిటంటే, ఇప్పటి దాకా యూత్ ఫుల్ సినిమాలు చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ అలియాస్ అర్జున్ రెడ్డి చేస్తున్న ఈ సినిమా మాత్రం పక్కా హర్రర్ జోనర్ అంట. మనకు హర్రర్ జోనర్ అంటే కామెడీ కితకితలే ఎక్కువ. కానీ ఈ సినిమా అలా కాదట. సిన్సియర్ హర్రర్ థ్రిల్లర్ అంట. ఆల్ మోస్ట్ పూర్తయిపోయిన ఈ సినిమా ప్రీ సమ్మర్ టైమ్ లోనే విడుదలయ్యే అవకాశం వుంది.