Home > Movies - Movie Gossip
అర్జున్ రెడ్డికి సెన్సారు సమస్యలు?

అర్జున్ రెడ్డి కొన్ని రోజుల క్రితం, మళ్లీ ఇటీవల వార్తల్లోకి వచ్చిన సినిమా. విజయ్ దేవర కొండ నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలకు సిద్దమవుతోంది. అయితే ఈ సినిమాకు సెన్సారు సమస్యలు ఎదురవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సెన్సారుకు వెళ్లారో, ఇంకా వెళ్లే ప్రయత్నాల్లో వున్నారో తెలియ రాలేదు కానీ, సినిమాలో కంటెంట్ కారణంగా రివిజన్ కమిటీ ముందుకు వెళ్లాల్సి వస్తుందేమో అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి.

అర్జున్ రెడ్డి సినిమాను ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ తో రూపొందిస్తున్నారు. ఇటీవల వదిలిన ట్రయిలర్ కు మాంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ట్రయిలర్ లో కనిపించలేదు కానీ, సినిమాలో అడల్డ్ కంటెంట్ జోరు కాస్త ఎక్కువే అన్న టాక్ వినిపిస్తోంది. అందులో వున్న అడల్ట్ కంటెంట్ కథ ప్రకారం అవసరమైనా కూడా కోతలు లేకుండా సర్టిఫికెట్ రావాలంటే రీజనల్ బోర్డులో పని కావడం కష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అసలు వ్యవహారం ఏమిటో పూర్తిగా తెలియాలంటే కాస్త ఆగాల్సిందే. మరి ఈ సమస్యలను అధిగమించి 25న విడుదలకు రెడీ అవుతుందో? లేదా మరి కాస్త ఆలస్యమవుతుందో?