Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆగస్టు అంతా ఫుల్ బిజీ

ఆగస్టు అంతా ఫుల్ బిజీ

ఆగస్టు నెలలో కూడా విడుదలకు సినిమాలు ఫుల్ గా రెడీ అయిపోతున్నాయి. తొలివారమే రెండు సినిమాలు ఢీకొంటున్నాయి. సాయిధరమ్, సందీప్ కిషన్ లతో కృష్ణవంశీ అందిస్తున్న నక్షత్రంతో సుకుమార్ తన సోదరుడితో తయారుచేసిన దర్శకుడు సినిమా ఢీ కొంటోంది.

మళీవారం ఏకంగా మూడు భారీ సినిమాలు పోటీ పడుతున్నాయి. నితిన్ లై, రానా 'నేనే రాజు నేనే మంత్రి', బోయపాటి 'జయ జానకి నాయక' ఢీకొంటున్నాయి. ఆ తరువాతి వారం అంటే ఆగస్టు 18న సునీల్ ఉంగరాల రాంబాబు, తాప్సీ ఆనందో బ్రహ్మ విడుదలకు రెడీ అవుతున్నాయి. ఒకటి కామెడీ, రెండవది హర్రర్ కామెడీ. 

ఆ తరువాతి వారం నాగ్ చైతన్య 'యుద్ధం శరణం' రెడీ గా వుంది. ఈ నెలలో విడుదల చేద్దాం అనుకున్న నారా రోహిత్ కథలో రాజకుమారి సినిమాను తీసుకెళ్లి అదే రోజున విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

అంటే ఆగస్టు మొత్తం మీద పది సినిమాల వరకు ఇప్పటికి రెడీ అయ్యాయి. ఇంకా ఎన్ని వచ్చి చేరతాయో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?