Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఔనా..కోనా..నిజమేనా?

ఔనా..కోనా..నిజమేనా?

టాలీవుడ్ లో టాప్ సీడ్ రైటర్ కోన వెంకట్. ఆయనకు డైరక్షన్ ఆసక్తి వుంది. అంతకన్నా సినిమా నిర్మాణంపైనా ఆసక్తి. త్వరలో మొదలు కాబోయే నిఖిల్ తో శంకరాభరణం సినిమా నిర్మాణంలో ఆయన పాత్ర కూడా వుంది.. అలాగే  నాగ‌చైత‌న్యతో కూడా ఓ సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట. 

అయితే అది మాత్రం పక్కా నిర్మాతగానే.  తెలుగు తమిళ ఆడియన్స్ కు పనికి వచ్చే ఓ మాంచి స్క్రిప్ట్ తయారుచేస్తున్నారని, దానిని ప్రముఖ దర్శకుడు గౌత‌మ్ మీన‌న్‌తో చేయించాలని ఆలోచిస్తున్నారని వినికిడి. హీరోగా నాగ చైతన్య అనుకుంటున్నారట. 

ఏమాయ చేసావె తరువాత మళ్లీ గౌతమ్ డైరక్షన్ లో చేయాలని చైతూకు  కూడా ఆసక్తిగానే వుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అయినట్లే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?