Home > Movies - Movie Gossip
అవార్డులపై బన్నీ సన్నిహితుడి కామెంట్

all mega heros should learn acting skills from tdp government to achive ap state awards

ఈ ఘాటు కామెంట్ ఎవరిదో కాదు, గీతా ఆర్ట్స్ లోని కీలక వ్యక్తి బన్నీ వాస్ తన ఫేస్ బుక్ లో చేసిన కామెంట్ ఇది. మెగా హీరోలకు ఎవ్వరికీ మూడేళ్లలో బెస్ట్ ఏక్టర్ అవార్డులు రాలేదు.

పైగా బన్నీ ఆ టైమ్ లో రెండు మంచి సినిమాలు చేసాడు. సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి. చిత్రాల్లో నటించాడు. రుద్రమదేవి చిత్రానికి బన్నీకి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు అవార్డు ఇచ్చారు. హీరోను పట్టుకుని క్యారెక్టర్ ఆర్టిస్టు అనడం ఏమిటో? కనీసం బెస్ట్ సపోర్టింగ్ రోల్ అన్నా వేరుగా వుంటుంది.

ఏమైనా ఈ అవార్డులు మెగాభిమానులను బాగానే కార్నర్ చేసినట్లు కనిపిస్తోంది. అందకే బన్నీ వాస్ ఫేస్ బుక్ వాల్ పై చేసిన పోస్టింగ్ లకు రియాక్షన్ బాగానే వస్తోంది. అలాగే పనిలో పనిగా ప్రేక్షకులే సరైన నిర్ణేతలు మారుతీ అంటూ భలే భలే మగాడివోయ్ ను ట్యాగ్ చేసాడు బన్నీ వాస్.