Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అయితే చరణ్ లేకుంటే ?

అయితే చరణ్ లేకుంటే ?

బెంగాల్ టైగర్ లాంటి మీడియమ్ హిట్ సినిమా తరువాత వెయిటింగ్ లో వుండిపోయారు దర్శకుడు సంపత్ నంది. ఆయన చెప్పిన చోటా మేస్త్రి లైన్ హీరో రామ్ చరణ్ కు నచ్చింది. దాంతో ఓకె అన్నారు కానీ ఎప్పుడు చేస్తారన్నదే తెలియదు. ధృవ వర్క్ జరుగుతోంది. మరి దాని తరువాత సుకుమార్ తో చేస్తారా? సంపత్ నంది కి చాన్స్ ఇస్తారా అన్నది తెలియాల్సి వుంది. 

సరే, ఎలాగూ ఖాళీ గా వున్నాం అని ఈ గ్యాప్ లో ఎనీ యంగ్ మాస్ హీరోకి సరిపడా మరో లైన్ అల్లేసి, డైలాగ్ వెర్షన్ తో సహా బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసేసారట. అయితే చరణ్ ఏ సంగతి చెప్పేవరకు సంపత్ నంది వెయింటింగ్ లో వుండక తప్పదు. అందుకే మరో రెండు మూడు రోజుల్లో కాశ్మీర్ నుంచి వచ్చే రామ్ చరణ్ ను అడిగి, ఆయన సలహా సూచన మేరకు ముందుకు వెళ్లాలని చూస్తున్నారట సంపత్ నంది. 

ఇదిలా వుంటే సంపత్ నందితో గతంలో రెండు సినిమాలు నిర్మించిన రాథామోహన్ హీరో నితిన్ తో ఓ సినిమా చేయాడానికి ఓకె చేయించుకున్నట్లు తెలుస్తోంది. మరి మళ్లీ సంపత్ నంది జతకలుస్తారా? వేరే డైరక్టర్ నా అన్నది నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?