Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాహుబలి-2కు గట్టిపోటీనిస్తున్న దంగల్

బాహుబలి-2కు గట్టిపోటీనిస్తున్న దంగల్

ఇప్పటికే ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ సాధించాయి. తర్వాత 1500 కోట్ల రూపాయల క్లబ్ లోకి కూడా ఎంటరయ్యాయి. ప్రస్తుతం బాహుబలి-2 కాస్త ముందుండగా, ఆ రికార్డును అందుకునేందుకు దంగల్ శరవేగంగా దూసుకొస్తోంది.

బాహుబలి-2కు అసలు పోటీ ఉండదనుకున్నారు. కానీ ఊహించని విధంగా దంగల్ సినిమా చైనాలో సూపర్ డూపర్ హిట్ అయింది. నిన్నటికి ఈ సినిమా వసూళ్లు ఒక్క చైనాలోనే 793 కోట్ల రూపాయలకు చేరాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన గ్రాస్ 1563 కోట్ల రూపాయలకు చేరింది.

ప్రస్తుతం బాహుబలి-2, దంగల్ సినిమాల వసూళ్ల మధ్య గ్యాప్ వందల కోట్ల రూపాయల నుంచి పదుల కోట్ల రూపాయలకు చేరింది. నిన్నటికి ఈ 2 సినిమాల మధ్య తేడా కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే. చైనాలో ఈ వీకెండ్ కూడా దంగల్ సినిమా భారీ వసూళ్లు సాధిస్తే బాహుబలి-2తో సమానంగా వసూళ్లు సాధిస్తున్న ఇండియన్ మూవీగా నిలుస్తుంది.

అయితే అత్యథిక వసూళ్లు సాధించడంలో దంగల్ కంటే బాహుబలి-2 సినిమాకే ఇంకా ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాల్లో దంగల్ తన ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది. ఆ సినిమాకు ఇప్పుడు మిగిలింది దాదాపు చైనా మార్కెట్ మాత్రమే. అటు బాహుబలి-2కు మాత్రం చైనా మార్కెట్ తో పాటు యూరోప్ బాక్సాఫీస్ ఇంకా ఓపెన్ గానే ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?