Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'బాబు' ఏమీ మాట్లాడరేం?

'బాబు' ఏమీ మాట్లాడరేం?

ఆంధ్రలో సినిమా రంగం లేకున్నా, సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రం వున్నారు. ఆంధ్రలో సినిమాహాళ్లు వున్నా, వాటిమీద పెత్తనం రెవెన్యూదే. అంతే కానీ సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖది కాదు. సరే, అవార్డులు ప్రకటించారు. అవి కాస్తా వివాదాస్పదం అయింది. మరి అలాంటపుడు సదరు సినిమాటోగ్రఫీ మంత్రి పెదవి విప్పాలి కదా? కానీ ఆయన విప్పరు. 

ఇంతకీ ఎవరా? సినిమాటోగ్రఫీ మంత్రి? సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే. ఆ శాఖ ఆయన దగ్గరే వుంది. అందువల్ల ఈ అవార్డుల వివాదంపై క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనదే. అవార్డుల ఎంపిక సరైనదనో, లేదూ, మరో కమిటీ వేసి, వీటిని పరిశీలిస్తామనో, కాదూ, రుద్రమదేవి, రేసుగుర్రం నిర్మాతల అభ్యంతరాన్ని పరిశీలిస్తామనో చెప్పాలి కదా? ఏమీ చెప్పకుండా కాలమే అన్ని గాయాలను మానుస్తుంది అనే రీతిలోనో, మొండివాడు రాజుకన్నా బలవంతుడు అనుకునో మిన్న కుంటే ఏమనుకోవాలి?

తాంబూలాలిచ్చేసాం తన్నుకు చావండి అన్నట్లు, అవార్డులు ఇచ్చేసాం తన్నుకోండి అని వదిలేసారు. దీనివల్ల మొత్తం మీద టాలీవుడ్ రెండుగా చీలినట్ల కనిపిస్తోంది. భవిష్యత్ లో ఆంధ్రకు రమ్మని టాలీవుడ్ జనాలను పిలిచినా, అవార్డులు సాధించిన అనుకూల వర్గం వెళ్లడానికి రెడీ అవుతుందేమో? కానీ, అవార్డులకు దూరం పెట్టిన వర్గం వెళ్లడానికి ఎలా ధైర్యం చేస్తుంది? ఈ విషయం చంద్రబాబు ఆలోచించడం లేదా? లేదా ఆ వర్గం వద్దనుకుంటున్నారా? ఆయన మౌనానికి అర్థం ఏమిటో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?