Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాబుకు ఎన్టీఆర్ దూరం.. ఇది పక్కా?

బాబుకు ఎన్టీఆర్ దూరం.. ఇది పక్కా?

మరోసారి ఎన్టీఆర్ మనోగతం అర్థం అయిపోయింది. చంద్రబాబుకు దగ్గరయ్యే ఉద్దేశం లేదని క్లియర్ అయిపోయింది. తెలుగు సినిమాలో డైలాగులు హీరోల వ్యక్తిగత స్కోత్కర్షకు, వ్యవహారాలకు అనుగుణంగానే వుంటాయి. రైటర్లు వాళ్ల వ్యవహారాలను దృష్టిలో పెట్టుకునే రాస్తారు కూడా. హీరోలకు ఏ మాత్రం నచ్చకపోయినా దగ్గరుండి మార్పిస్తారు. అలాంటిది జైలవకుశలో పడ్డ డైలాగులు, పాత్రలు వగైరా ఎన్టీఆర్-బాబుల మధ్య గ్యాప్ లను చెప్పకనే చెప్పేసాయి.

'మనం అనేది అబద్ధం,. నేను అనేది నిజం' అని చెప్పడంతో ఆగకుండా, 'మళ్లీ దగ్గర కావడానికి నాటకాలు ఆడుతున్నార్రా' అని కూడా అనిపించేసాడు. ఇటీవల హరికృష్ణకు పదవి ఎరవేసి, ఎన్టీఆర్ ను లైన్లో పెట్టుకుంటారని తెగ పోలిటికల్ గ్యాసిప్ లు వినిపించాయి. ఈ డైలాగ్ తో అవే గుర్తుకు వచ్చాయి. 

పైగా రాష్ట్రంలో అపోజిషన్ ప్రభుత్వం వుంది. కేంద్రం దగ్గర మనకు గుర్తింపు వచ్చింది. గెలిపించే వాడికన్నా, గెలిచేవాడికే గుర్తింపు వుంటుంది, నన్ను ఇలా తయారు చేసింది మీరే, వంటి డైలాగుల వెనుక కూడా పొలిటికల్ వ్యవహారాలు కనిపిస్తున్నాయి. అన్నింటికి మించి జై పార్టీ సమ సమాజ్ పార్టీ అని వుంటుంది. నిజంగా తెలుగు పార్టీ మీద అభిమానం వుంటే మనదేశం పార్టీ అనో, ఈదేశం పార్టీ అనో సరదాగా అయినా పెట్టి వుండొచ్చు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే జై ని అణగదొక్కింది ఎవరు? సినిమాలో పోసాని క్యారెక్టర్. ఆ పాత్ర జై కు మామయ్య. దమ్ము సినిమాలో నాజర్ పాత్ర కూడా కంసమామకు ప్రతిరూపంగా వుంటుంది. అక్కడ ఆ మామ బారి నుంచి తాత బయటవుంచి కాపాడినట్లు కథ వుంటుంది. ఇక్కడ కూడా మళ్లీ మామయ్యే తనను అణగదొక్కినట్లు చూపించారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు మావయ్య వరసే అవుతారన్న సంగతి తెలిసిందే.

అన్నీ బాగానే వున్నాయి. కానీ ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ గుర్తించింది అన్న డైలాగులు వినిపించాయి సినిమాలో. కొంపదీసి భాజపాకు దగ్గరయ్యే ఉద్దేశం ఏమన్నా వుందా? ఏమిటి? పైగా పవన్ కళ్యాణ్ ను మోడీ దూరం పెట్టారని, ఇటీవల స్వఛ్ భారత్ కు సంబంధించిన కార్యక్రమానికి ఆహ్వానం కూడా పంపలేదని వార్తలు వినవస్తున్న నేఫథ్యంలో అటు దృష్టి వెళ్లిందా ఏమిటి? ఏమో? ఏదైనా జరగవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?