Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'బాహుబలి' కమ్మ వాళ్ల ఘనతా..?!

'బాహుబలి' కమ్మ వాళ్ల ఘనతా..?!

చాలా మందికి ఈ టాపిక్ గురించి మాట్లాడటమే ఇష్టం లేనట్టుగా చెబుతుంటారు. ఈ రోజుల్లో కూడా 'కులం' గురించి చర్చ ఏమిటి? అంటూ వీరు ధ్వజమెత్తుతూ ఉంటారు. అయితే ఇలాంటి మాటల్లో కొంత 'హిపోక్రసీ' కూడా లేకపోలేదు. మరి వీరి సంగతిలా ఉంటే.. తమ కులం వారి అచీవ్ మెంట్స్ ను చూసి గర్విస్తున్న వారు కూడా కనిపిస్తూ ఉంటారు. వీరి సగర్వంగా ఈ విషయాన్ని ప్రకటించుకొంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇది దర్శకుడు రాజమౌళి విషయంలో.. 'బాహుబలి' విషయంలో!

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన.. భారీ బడ్జెట్ తో కూడుకొన్న సినిమాను రూపొందించి.. దాని విడుదలతో అందరికీ ఆకట్టుకొన్న.. విజయవంతమైన సినిమాను సృజించినది ఒక కమ్మవాడు అయినందుకు గర్విస్తున్నాం.. అని కొంతమంది ప్రకటించుకొంటున్నారు. ఫేస్ బుక్ లో ఇలాంటి పోస్టులు కనిపిస్తున్నాయి. కమ్మ సామాజికవర్గానికి చెందిన యువతీయువకుల్లో కొంతమంది ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. దర్శకుడు రాజమౌళి తమ ప్రైడ్ అని వారు పేర్కొంటున్నారు! కమ్మ వాళ్లలో సహజంగానే సృజనాత్మక శక్తి ఎక్కువ అని.. దీనికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయని.. అందుకు తాజా రుజువు రాజమౌళి.. అంటూ వీరు తమ సృజనాత్మక శక్తిని ప్రదర్శిస్తున్నారు.

మరి ఎవరినైనా అభిమానించడానికి.. ఓన్ చేసుకోవడానికి కులం అనేది ఒక ఫ్యాక్టర్ గా నిలిస్తే అది మంచిదే. ధ్వేషించడానికి కాకుండా... అభిమానించడానికి కులం కారణం అయితే మేలే కదా! రాజమౌళిని కమ్మ వాళ్లు ఈ రకంగా ఆరాధించడానికి కులం కారణం అయితే దాన్ని కూడా స్వాగతింవచ్చు. అయితే ఇలా ఒక దర్శకుడిని కొంతమంది ఓన్ చేసుకోవడం వల్ల మిగిలిన వారికి దూరం పెరగవచ్చు! జాగ్రత్త సుమీ!

పీ.ఎస్ః నిజంగా తమకు రాజమౌళి సామాజికవర్గం ఏమిటో ఇంత వరకూ తెలియదని.. ఇప్పుడు రాజమౌళిని తమ ప్రైడ్ గా పేర్కొంటున్న వాళ్ల వల్లనే ఆయన ఆ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని తమకు తెలుస్తోందని.. మరికొంతమంది వ్యాఖ్యానిస్తుండటం విశేషం! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?