Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాహుబలి పవర్ స్టార్

బాహుబలి పవర్ స్టార్

బాహుబలి మొదలై ఆ మధ్య దాకా దాదాపు అందులో నటించే కీలక నటలంతా గడ్డాలు, జుట్టు పెంచి కనిపించేవారు. ప్రభాస్, రానా, ఇంకా చాలా మంది. ఆఖరికి ఆ సినిమా డైరక్టర్ రాజమౌళి కూడా. ఇప్పుడు ఉన్నట్లుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అలాగే కనిపించారు. పవన్ కళ్యాణ్ చాలా రేర్ కా కనిపిస్తారు..జనాల్లోకి వస్తారు. అందునా ట్విట్టర్ లో చేరాక మరీ అరుదైపోయారు. ఈ మధ్యకాలంలో ఆయన ఫొటో కనిపించింది లేదు. ఇప్పుడు ప్రెస్ కు ఆయన ఫొటో వచ్చింది. శ్రీజ అనే అమ్మాయి, ఆమె తల్లితండ్రులు పవన్ ను కలిసారు. ఈ సందర్భంగా ఫొటో దిగారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడి పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఓదార్పుతో తిరిగి కోలుకున్న 'శ్రీజ' తన తల్లిదండ్రులు నాగయ్య,నాగమణి సోదరి షర్మిల శ్రీ లతో కలసి ఈ రోజు (సోమవారం) ఉదయం పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'ను ఆయన కార్యాలయంలో కలిశారు.దాదాపు రెండుగంటల సమయం 'పవన్ కళ్యాణ్' శ్రీజ కుటుంబ సభ్యులతో సంభాషిస్తూ గడిపారు.

ఈ సందర్భంగా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' మాట్లాడుతూ..' శ్రీజ పూర్తి ఆరోగ్యవంతురాలు కావటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. శ్రీజ కు  వైద్యం చేసిన డాక్టర్ 'అసాదారణ్' కు కృతఙ్ఞతలు తెలిపారు. 'శ్రీజ' కుటుంబ సభ్యులు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ను కలవటం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని, ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు.

అన్నీ బాగానే వున్నాయి. పవన్ గెటప్ చూసిన వాళ్లు..బాహుబలిలో పవన్ కూడా నటిస్తున్నారా ఏంటి? అలాంటి గెటప్ లో వున్నారు. లేదా గబ్బర్ సింగ్ 2 లో ఇలా వుంటారా అని అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?