Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాహుబలి వల్ల రుద్రమకు ఒరిగింది లేదా?

బాహుబలి వల్ల రుద్రమకు ఒరిగింది లేదా?

బాహుబలి సినిమా హిట్ కావడం వల్ల, ఈ తరహా సినిమాలపై క్రేజ్ పెరిగిందని అందరూ అనుకోవడం కామన్. రుద్రమదేవి సినిమాకు కూడా బాహుబలి ఎఫెక్ట్ కలిసి వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అవుతుందో తెలియదు, కానీ తనకు వ్యక్తిగతంగా ఏ మాత్రం ప్రయోజనం వుండదని అంటున్నాడట దర్శక నిర్మాత గుణశేఖర్...ఆఫ్ ది రికార్డుగా. 

ఎందుకంటే తాను రుద్రమదేవిని..రుద్రమదేవిగా చూసే ప్రేక్షకుల అంచనా లెక్క ప్రకారం, బయ్యర్లకు ఏనాడో అమ్మేసానని చెబుతున్నాడట. దానివల్ల ఒకవేళ జనం బాహుబలి మాదిరిగా దీన్ని కూడా ఆదరిస్తే, తనకు మంచి పేరు వస్తుందేమో కానీ, డబ్బులు మాత్రం రావడంటున్నాడట. 

కానీ గుణ ఇక్కడో లాజిక్ మిస్ అవుతున్నాడేమో? పేరు వచ్చినా అది రేపు మరో సినిమా మీద డబ్బుగా మారుతుంది. పైగా రుద్రమదేవి హిట్ అయితే బయ్యర్యలు హ్యాపీ అయితే గుణ జోలికి రారు. అలా కాకుండా అయితే గుణ వైపు చూస్తారు. ఆ విధంగా కూడా బాహుబలి వల్ల గుణకు మేలే జరుగుతుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?