Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బలవంతపు పారితోషికం?

బలవంతపు పారితోషికం?

ఒక్కోసారి అవసరం అయినపుడు పావలా వస్తువు పది రూపాయలకు కొనాల్సిందే. టాలీవుడ్ లో ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయి. వీలయినంత వరకు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. అయితే లేటెస్ట్ గా ఓ హీరోకి కొటి రూపాయిలు ఆఫర్ చేసారంటున్న ప్రచారం వెనుక వేరే వైనం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గట్టిగా రెండు సరైన సినిమాలు లేకుండానే హీరోకి కోటి రూపాయిలు ఇచ్చారట. అయితే ఇవ్వలేదని, డిమాండ్ చేసి, తీసుకున్నారని, సదరు సినిమా నిర్మాత దగ్గర వాళ్ల దగ్గర వాపోతున్నారట.

అసలు ఏం జరిగింది అంటే, ఆ నిర్మాతకు ఓ డైరక్టర్ తో సినిమా చేయాలని వుంది. ఆ డైరక్టర్ ఇటీవలే పెద్ద హిట్ ఇచ్చాడు. కానీ ఆ డైరక్టర్ ఓ హీరోకి చెందిన సంస్థలో లాక్ అయ్యాడు. దాంతో ఆ హీరోను పెట్టుకుంటే, ఈ డైరక్టర్ దొరుకుతాడు. కానీ ఏమయింది ఆ హీరో తనకు కోటికి పైగా ఇవ్వాలని, సర్వీస్ టాక్స్ కూడా ఇవ్వాలని పట్టుపట్టాడట. ఆ హీరోకు అందులో సగం రేంజ్ మార్కెట్ లేకపోయినా, పాపం, డైరక్టర్ కోసం నిర్మాత ఇవ్వక తప్పలేదట. తప్పదు అవసరం మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?