Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్య రాక్స్.. తన మార్క్ చూపించాడు

బాలయ్య రాక్స్.. తన మార్క్ చూపించాడు

బాలయ్య అంతే.. ఎప్పుడు ఏ సినిమా ఓకే చేస్తాడో, ఏ దర్శకుడ్ని తెరపైకి తీసుకొస్తాడో చెప్పడం చాలా కష్టం. ఇకపై తన నుంచి డిఫరెంట్ కాంబినేషన్లు వస్తాయని వందో సినిమా టైమ్ లోనే ప్రకటించిన బాలయ్య.. చెప్పినట్టుగానే కొత్తకొత్త కాంబోలకు తెరతీస్తున్నాడు.

101వ సినిమాకు పూరీ జగన్నాథ్ ను సెలక్ట్ చేసుతున్న బాలయ్య.. 102వ సినిమాను కేఎస్ రవికుమార్ తో చేస్తున్నాడు. ఇప్పుడు 103వ సినిమాకు అనిల్ రావిపూడిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా వచ్చే ఛాన్స్ ఉంది.

నిజానికి బాలయ్య లిస్ట్ లో మొన్నటివరకు బోయపాటి పేరు వినిపించింది. సింహా, లెజెండ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ సడెన్ గా అనిల్ రావిపూడి పేరు తెరపైకి రావడం విశేషం.

ఎప్పటికప్పుడు మీడియాకు లీకులిచ్చే అనిల్ రావిపూడి కూడా ఈ విషయంపై మాట్లాడలేదు. మొన్నటివరకు వెంకీ హీరోగా ఓ మల్టీస్టారర్ మూవీ ప్లానింగ్ లో ఉన్నానని చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. ఇప్పుడు సెడన్ గా బాలయ్యతో సినిమా అంటూ వార్తలొస్తున్నాయి. త్వరలోనే బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోపై అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?