Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్య కారులో లేడా.. పరారయ్యిందెవరు?

బాలయ్య కారులో లేడా.. పరారయ్యిందెవరు?

నందమూరి నటసింహం కారు విజృంభణ కొనసాగుతోంది. ఇది వరకూ అనంతపురం జిల్లాలో ఒకసారి బాలయ్య కారు బీభత్సం సృష్టించింది. లేపాక్షి వద్ద రోడ్డు డివైడర్ ను ఢీ కొని.. బాలయ్య కారు వార్తల్లోకి వచ్చింది. అయితే అది పెద్ద ప్రమాదం ఏమీ కాదు. అయితే ఎంతైనా బాలయ్య కారు కాబట్టి ఆ అంశం వార్తల్లోకి వచ్చింది. డ్రైవర్ పొరపాటుతోనే ఆ ప్రమాదం జరిగిందన్నారు.తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ లో బాలయ్య కారు బీభత్సం సృష్టించింది. 

అనంతపురం లో రిజిస్టర్ అయిన  ఈ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టింది. బసవతారకం ఆసుపత్రి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీ 02 సీరిస్ తో సాగే ఈ నంబర్ ను బట్టి  కారు నందమూరి బాలకృష్ణ పేరు మీదే రిజిస్టర్ అయినట్టుగా ధ్రువీకరించారు.బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఖరీదైన కార్లు బీభత్సాలు సృష్టించడాలు చాలా రొటీన్ గా జరిగే పనులే. 

ఎంతోమంది ఉన్నోళ్ల పిల్లలు తాగి కార్లతో విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటారు. అనేక మంది సెలబ్రిటీలు కూడా ఈ ఏరియాల్లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతూ ఉంటారు. ఇటీవలే ఒక కేంద్రమంత్రి కొడుకు ఒక ఖరీదైన కారుతో సినీ మ్యాక్స్ వద్ద విధ్వంసం సృష్టించాడు. ఈ పరంపరలో తాజాగా బాలయ్య కారు కూడా చేరింది.ఫోల్ ను ఢీ కొని కారు తలకిందుల అయ్యిదంటే.. వచ్చిన వేగం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

సంఘటన జరిగింది అర్ధరాత్రి కావడంతో రోడ్డున పోయే వారెవరూ లేకపోవడంతో బయటి వాళ్ల ప్రాణాలేమీ పోలేదు. మరి ఇంతకీ ఈ కారును నడిపిందెవరు? అనేది అంతుబట్టకుండా ఉందిప్పుడు.ప్రమాదం జరిగిన వెంటనే.. అందులో ప్రయాణించిన వారు ఉడాయించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అలా పారిపోవడం అంటే ఏమనుకోవాలి? యాక్సిడెంటల్ గా ఇలా జరిగి ఉంటే.. పోలీసులకు కనీస సమాచారం ఇచ్చే ఉండాల్సింది.

 కానీ పారిపోవడం అంటే.. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసా? లేక ఇంకా మరేమైనానా? అనే సందేహాలు సహజంగానే తలెత్తుతాయి. ఈ కారులో బాలయ్య ప్రయాణించలేదని మీడియాలో చెప్పుకొస్తున్నారు. మరి కారుతో బీభత్సం సృష్టించి పారిపోయిందెవరో తెలీయదంటున్నారు.. బాలయ్య కారులో ప్రయాణించలేదంటున్నారు.. రెండింటికీ ఏమైనా పొంతన ఉందా? ఎవరో తెలీయనప్పుడు.. బాలయ్య కాదు, అని ఎలా తెలిసిందబ్బా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?