Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సినీ హీరోల అసలు రంగును చూపించిన బాలయ్య!

సినీ హీరోల అసలు రంగును చూపించిన బాలయ్య!

అసలు సినీ హీరోలను ఆరాధించే వాళ్లు సిగ్గుపడాలి. సినిమాను సినిమాగా చూడక ఆ హీరోలను అంతటితో వదలక.. వాళ్లను వీర లెవల్లో అభిమానిస్తూ ఇజాల పేరుతో గుడ్డి అభిమానాన్ని చూపుతూ, వెర్రి తలలు వేస్తున్న సినీ అభిమానానికి అప్పుడప్పుడు ఆ హీరోల నుంచే చుక్కెదురవుతూ ఉంటుంది. ఈ పరంపరలో ఇప్పుడు మరోసారి బాలయ్య రూపంలో సినీ హీరోల తీరు ఎలా ఉంటుందో స్పష్టం అవుతోంది.

వాళ్లకు తెరపై కనిపించినంత ఓర్పు, సహనం, మంచితనం.. నిజ జీవితంలో మచ్చుకైనా ఉండదని బాలయ్య ద్వారా స్పష్టం అవుతోంది. తెరపై వారిది హీరోజమే అయినా.. తెర బయట మాత్రం వారి తీరు విలన్ కు తక్కువ కమేడియన్లకు ఎక్కువ అన్నట్టుగా ఉంటుందని బాలయ్య తీరు స్పష్టం చేస్తోంది. తాజాగా ఇంటర్నెట్ లో ఒక వీడియో షికారు చేస్తోంది.

నందమూరి నటసింహం బాలయ్యతో కొంతమంది అభిమానులు ఫోటోలు దిగుతున్న సమయంలో తీసిన వీడియో అది. మరి అభిమానులు ముచ్చటపడ్డారు, వారితో ఫొటోలు దిగడానికి బాలయ్య ఓకే చెప్పినట్టుగా ఉన్నాడు. ఒక్కోరి భుజం మీద చేతులు వేస్తూ బాలయ్య ఫొటోలకు పోజులు ఇచ్చాడు. అక్కడ వరకూ బాగానే ఉంది కానీ.. ఆ సమయంలో బాలయ్య మాట తీరు మాత్రం వామ్మో అనిపిస్తోంది.

ఇదేంట్రా బాబూ.. అంత దురుసుదనం ఏమిటి? అని అనిపిస్తోంది. ఛీదరింపులు, అదిరింపులు, బెదిరింపులు.. అభిమానులతో బాలయ్య వ్యవహరించిన తీరు అది! ‘కొట్టాను అనుకో.. పళ్లు రాళ్తాయ్..’, ‘ఏయ్.. తీయ్.. పక్కనపో..’, ‘ఆ చూపేంటి.. అలా చూస్తావేంటి..’... ఇవీ బాలయ్య నోటి నుంచి అభిమానుల పట్ల జాలువారిన ఆణి ముత్యాలు.

అభిమానంతో బాలయ్యతో ఫొటోలు తీయించుకోవాలని అనుకున్న ఫ్యాన్స్ మొహాలు మాడిపోయాయి. వాళ్లు చిన్నబుచ్చుకున్నారు. అయితే బాలయ్య మాత్రం రెండు నిమిషాల వీడియోలోనే అన్ని సార్లు గద్దించారు. ఆ వీడియోను చూసి బాలయ్య ఫ్యాన్స్ ఆనందపడుతున్నారేమో కానీ, ఫ్యాన్స్ లేకపోతే లేని ఒక సినీ హీరోకి అంత అహభావం ఎందుకు? అనే సందేహం మాత్రం సామాన్యుల్లో కలుగుతుంది.

ఆ వెర్రిబాగుల ఫ్యాన్స్ లేకపోతే ఈ హీరోలకు జీవితమే లేదు. అలాంటిని అంత ఛీదరించుకోవాల్సిన అవసరం ఉంటుందా? అందునా బాలయ్య ఒక ప్రజాప్రతినిధి కూడా. ఫొటోలు దిగడం ఇష్టం లేకపోతే వాళ్లకు ఛాన్సే ఇవ్వకూడదు. కానీ.. అలాంటి అదిలింపులు, ఛీదరింపులతో బాలయ్య తన పరువునే పోగొట్టుకుంటున్నాడు. సినీ హీరోల అసలు రంగును చూపించాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?