Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్య సరసన అంజలి

బాలయ్య సరసన అంజలి

గీతాంజలి హిట్ అయినా సరైన సినిమా పడలేదు మళ్లీ అంజలికి. గీతాంజలి సీక్వెల్ అన్నారు. రేటు ఎక్కువ చెప్పిందని తప్పించారని వార్తలు వినవచ్చాయి. ఆ తరువాత మళ్లీ వార్తల్లో కనిపించలేదు..వినిపించలేదు. 

తాజా విషయం ఏమిటంటే, బాలయ్య 99 వ సినిమాలో ఒక హీరోయిన్ గా అంజలిని కన్ ఫర్మ్ చేసారన్నది. శ్రీవాసు దర్శకత్వం వహించే ఈ సినిమాకు కోన వెంకట్ అండ్ కో పని చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఇద్దరు హీరోయిన్లకు గాను ఒక హీరోయిన్ గా అంజలిని ఓకె చేసారట. బాలయ్య సరసన అంజలి కచ్చితంగా మంచి మ్యాచ్ అవుతుందని అంటున్నారు. మరో హీరోయిన్ కొసం వెదుకులాడుతున్నారు. జూన్ నుంచి పట్టాలెక్కుతుందీ సినిమా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?