Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోయిన్ తో బాలయ్య మోటు సరసం..!

హీరోయిన్ తో బాలయ్య మోటు సరసం..!

మా బాలయ్య అంతే.. అని అభిమానులు మురిసిపోతున్నారు. ఇదేంటి బాబోయ్ అని.. మిగతా వాళ్లు అనుకుంటున్నారు. టీవీ చానళ్ల లో.. ‘గౌతమిపుత్రశాతకర్ణి’ ప్రమోషన్ సందర్భంగా ఆ సినిమా టీమ్ తో కలిసి కనిపిస్తున్న నందమూరి నటసింహం ఆ సినిమా హీరోయిన్ శ్రియతో మోటు సరసాన్ని కొనసాగిస్తున్నాడు. శాతకర్ణి టీమ్ అంతా సంభాషించే ప్రచార కార్యక్రమం టీవీల్లో ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమంలో సినిమా గురించి ఎన్నో విషయాలను చెబుతున్నారు. ఒకరినొకరు ప్రశంసించుకుంటున్నారు, అంతా కలిసి తమ సినిమాను ప్రశంసించుకుంటున్నారు.

ఇలా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఒక్కోరు ఒక్కో సీట్ లో కూర్చుంటారు. కానీ, బాలయ్య –శ్రియలు ఒకే సీట్ లో కూర్చుంటారు. ఇక  హీరోయిన్ పక్కన కూర్చోవడంతోనే బాలయ్య హీరో అయిపోతాడు!

సినిమా పాటల ప్రస్తావన వచ్చినప్పుడైతే బాలయ్య సీట్లోనే డ్యాన్సులు వేసేస్తున్నాడు. ఆమెను తడతాడు, కొడతాడు, నడుముతో నెడతాడు.. బాలయ్య మార్కు రొమాన్స్! ఇలా రెచ్చిపోతున్నాడు నందమూరి నటసింహం. బాలయ్య అంతే.. చిన్న పిల్లాడి టైపు, హీరోయిన్లను గిల్లడం, ఎక్కడైన వారు పక్కన కూర్చోగానే ఈ తరహాలో సరసాలు ఆడటం.. ఆయన ముచ్చట.. అని అభిమానులు మురిసిపోతున్నారు.

ఇక సినిమాల్లో అంటే ఈ హీరోలు తమ వయసులో సగం ఉన్న అమ్మాయిలతో డాన్సులేసినా, రొమాన్స్ చేసినా.. అది సినిమా కాబట్టి అలా చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ.. బయట కూడా ఇదేమిటి? అనేది సగటు ప్రేక్షకుడి సందేహం! అందునా ఎమ్మెల్యే, తీసింది చారిత్రాక సినిమా అంటున్నారు, ఇలాంటి సినిమా విషయంలోనూ ఇలానా? అని ఇలాంటి వారు అంటున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?