Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బండ్ల..ఇది మరీ కాస్త ఓవర్ గా లేదూ?

బండ్ల..ఇది మరీ కాస్త ఓవర్ గా లేదూ?

నవ్విపోదురుగాక..నా ఇచ్చయే నాది అనే టైపు నిర్మాత బండ్ల గణేష్ ది. స్టేజ్ మీద మెగా ఫ్యామిలీని వీలయినప్పుడల్లా ఎత్తుతూనే వుంటాడు. ఇప్పుడు మరోసారి అదే చేసాడు.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా నాలుగు గబ్బర్ సింగ్ డిజైన్లు విడుదల చేసాడు. వాటిల్లో కొటేషన్లు ఓ రేంజ్ లో వున్నాయి. తెలుగు జాతికి పవన్ తప్ప వేరే దిక్కు లేదన్నట్లు, అతగాడే చరిత్ర సృష్టించగలడని, రైతు జాతి ఎజెండా, కోటప్ప కొండ అంటూ ఏదేదో ప్రాసలు వేసేసాడు.

అక్కడితో ఆగకుండా ఇంగ్లీషులో కూడా ప్రావీణ్యం చూపించాడు. ది మాన్, ది విజన్, ది ఫ్యూచర్.. వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటూ. ఏమిటో బండ్ల పైత్యం మరీ ముదిరిపోతోందేమో, మెగా ఫ్యామిలీపై. అసలే చేతిలో సినిమా లేదు. ఈ మాటలకు మురిసి అయినా ఎవరో ఒకరు డేట్లు ఇచ్చేస్తారంటారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?