Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బెల్లంకొండకు డైరక్టర్ కావలెను

బెల్లంకొండకు డైరక్టర్ కావలెను

బెల్లంకొండ శ్రీనివాస్ కు సరిపడా మాంచి కమర్షియల్ సినిమా సబ్జెక్ట్ ఎవరి దగ్గరన్నా వుంటే, రెడీ అయిపోవచ్చు. కానీ కండిషన్ వుంటుంది. కాస్త పేరున్న డైరక్టర్ అయి వుండాలి. ఎందుకంటే బెల్లంకొండ శ్రీనివాస్ తో మరో ప్రాజెక్టు స్టార్ట్ చేయాలని, అతని తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ రెడీ అయపోతున్నారు. 

జయ జానకి నాయక సినిమాకు పాజిటివ్ బజ్ రాగానే కొడుకుతో సంక్రాంతి వేళకు మరో సినిమా రెడీ చేయాలని సురేష్ భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం చేస్తున్న శ్రీవాస్-అభిషేక్ పిక్చర్స్ సినిమా సంక్రాంతి వేళకు రెడీ కాదు. దానికి గ్రాఫిక్స్ పనులు అవీ వున్నాయి. మార్చికి కానీ రెడీ కాదు. 

అందుకే ఆ సినిమాతో సమాంతరంగా, మరో సినిమాను ఈ అయిదు నెలల్లో పూర్తి చేసే ప్రాజెక్టు కోసం బెల్లం కొండ సురేష్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ బెల్లంకొండకు కాస్త రేంజ్ వున్న డైరక్టర్లు తప్ప వేరు వారు నచ్చరు. మరి అలాంటి వాళ్లు ఎవరూ ఇప్పుడు ఖాళీ లేరు. అందువల్ల ప్రాజెక్టుకు ఎవరు సెట్ అవుతారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?