Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

భక్తి మాటేమో కానీ రక్తి అదిరింది

భక్తి మాటేమో కానీ రక్తి అదిరింది

నాగ్-రాఘవేంద్రరావు కాంబినేషన్లోని ఓం నమో వెంకటేశాయ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఫిబ్రవరి 10న విడుదల చేస్తున్నామని పేర్కొంటూ రెండు స్టిల్స్ విడుదల చేసారు. వీటిల్లో నాగ్-ప్రగ్య జైస్వాల్ స్టిల్ ఒకటి. ఓం నమో వేంకటేశాయ అన్నది తిరుపతిలో చిరకాలం వున్న హాథీరామ్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న చిత్రం. 

మరి ఆయన చరిత్ర ఏమిటో, అందులో దర్శకేంద్రుడు ఇలాంటి సీన్ ఎలా చొప్పించారో తెలియదు. అయితే స్టిల్ మాత్రం అదిరింది. నాగ్ గెటప్ సూపర్ అనిపించేలా వుంది. నాగ్ పరిష్వంగంలో తాద్యత్మం చెందుతున్న ప్రగ్య జైస్వాల్ కూడా సూపర్ గా వుంది. 

భక్తి రస సినిమా అయిపోయింది కానీ, ఇదే సోషల్ రొమాంటిక్ సినిమా అయితే ఇదే జంట కన్నుల పంటగా వుండి వుండేదేమో? మొత్తం మీద ఓం నమో వేంకటేశాయ మీద ఒక వర్గం ప్రేక్షకుల్లోనే బజ్ వుందేమో అనుకుంటే, ఈ స్టిల్ తో అన్ని తరహా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?