Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'బిగ్ బాస్' కే తలనొప్పిగా మారిన మెగాస్టార్ హీరోయిన్..!

'బిగ్ బాస్' కే తలనొప్పిగా మారిన మెగాస్టార్ హీరోయిన్..!

రిమీ సేన్ గుర్తుందా..?! మెగాస్టార్ చిరంజీవి డబుల్ పోజులో హీరోగానటించిన  'అందరివాడు' సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసిన బెంగాలీ బేబీ తను. ఆ సినిమా అంతగా ఆడకపోయినా.. అందులో రిమీసేన్ నటన మాత్రం ఆకట్టుకొంటుంది. నటనలో మెగాస్టార్ కు ధీటుగా పోటీ పడిందామె. అయితే ఆ ప్రతిభావంతురాలికి తెలుగులో మళ్లీ అవకాశాలు లభించలేదు. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆమె పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో తను 'బిగ్ బాస్' ప్రోగ్రామ్ లోకి అడుగుపెట్టింది.

సాధారణంగా పెద్ద పెద్ద వివాదాల్లో పేరు తెచ్చుకున్న వాళ్లే ఈ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యులు అవుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి భిన్నంగా ఈ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగాలీ బ్యూటీ తీరా అక్కడ చేరాకా.. నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. బిగ్ బాస్ స్కాండల్ హౌస్ రియాలిటీ షోలో పాల్గొనే ప్రతి సెలబ్రిటీ కూడా అక్కడ కొన్ని కాంపిటీషన్లలో, కొన్ని యాక్టివిటీస్ లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ రిమీ ఆ నియమాలకు తలవంచడం లేదు. మిగతా సెలబ్రిటీలతో పాటు ఆమె యాక్టివిటీస్ లో పాలుపంచుకోవడం లేదు!

అదేమంటే.. ఆమె ఆన్సర్ చెప్పడం లేదు. ఆ హౌస్ తనకు ఏ మాత్రం నచ్చడం లేదని ఆమె అంటోంది. అలాగని అక్కడ నుంచి ఆమె బయటకు రావడం లేదు! దీంతో నిర్వాహకులు తలపట్టుకున్నారు. ఎవరైనా సెలబ్రిటీని నిర్వాహకులు అక్కడ నుంచి పంపించేయాలంటే దాదాపు రెండు కోట్ల రూపాయలు చెల్లించాలి. సదరు సెలబ్రిటీలు తామంతకు తాము బయటకు వెళితే వాళ్లకు చాలా తక్కువ మొత్తం దక్కుతుంది. దీంతో రిమీ తనంతకు తాను బయటకు వెళ్లడం లేదు.

ఇక ఎస్ఎమ్ఎస్ ల ద్వారా నిర్వహించే ఓటింగులో రిమీకి ఫుల్ సపోర్ట్ ఉంది. దీంతో ఆమెను ఓటింగ్ ద్వారా బయటకు పంపడం కూడా కుదరడం లేదు. దీంతో నిర్వాహకులు మిన్నకుండి పోయారు. ఆమెను మెప్పించలేక.. బయటకు వెళ్లడానికి ఒప్పించలేక తలపట్టుకున్నారు. పాపులర్ హీరోయిన్ ప్రేక్షకుల నుంచి ఉన్న మద్దతుతో రిమీ చివరకు బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే రిమీ ఎలాంటి యాక్టివిటీస్ లో పాల్గొనకుండా గెలిస్తే మాత్రం ఓవరాల్ గా నిర్వాహకులు వెర్రివాళ్లు అవుతారు! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?