Advertisement


Home > Movies - Movie Gossip
బిగ్ బాస్ లోకి నవదీప్

మరో యంగ్ యాక్టర్ బిగ్ బాస్ (తెలుగు) ఇంట్లొకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దీక్ష లోపలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈవారం హీరో నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హవుస్ లోకి వెళ్లబోతున్నారు. ఇదిలా వుంటే ప్రతివారం ఒకరిని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లో ఈ వార్త కాస్త ఛేంజ్ చేస్తున్నారు. 

ఇద్దరిని బయటకు పంపిస్తారు. ఈ మధ్యాహ్నం ఓటింగ్ వివరాలు పూర్తిగా వచ్చిన తరువాత బయటకు పంపే ఇద్దరిని డిసైడ్ చేసి, రేపు రాత్రికి ప్రకటిస్తారు. షూట్ మాత్రం ఎప్పటిలాగే ఒక రోజు ముందుగా తయారవుతుంది.

ఇప్పటికి ప్రిన్స్ ఒక్కడే కాస్త యంగ్ బాయ్ షో లో వున్నాడు. ఇప్పుడు నవదీప్ తోడవుతున్నాడు. చిత్రమేమిటంటే, ఇప్పటికే బిగ్ బాస్ హవుస్ లో వున్న ముమైత్ ఖాన్ డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొన్నారు.

అలాగే బిగ్ బాస్ హవుస్ లోకి వెళ్లబోతున్న నవదీప్ కూడా అదే విచారణ ఎదుర్కొన్నారు. టీవీ షో ల నిర్వహణలో అనుభవం వున్న నవదీప్ బిగ్ బాస్ హవుస్ లో ఏ మేరకు సందడి చేస్తారో చూడాలి.