Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బిగ్ బాస్ పక్కకెళ్లద్దురో..

బిగ్ బాస్ పక్కకెళ్లద్దురో..

బిగ్ బాస్ షోకి వీక్షకుల కొరత వుందా? లేదా? అన్న సంగతి అలా వుంచితే, అందులోకి పంపడానికి సెలబ్రిటీల కొరత మాత్రం భయంకరంగా వుంది. అసలు షో స్టార్ట్ చేసే ముందు దాదాపు వందమందిని అనుకుంటే ఆ పధ్నాలుగు మంది దొరకడం గగనం అయింది. రకరకాల క్వశ్చన్లు, సైకాలజిస్ట్ లు, అందరూ కలిసి మాట్లాడ్డం, తీరా కేండిడేట్ ను వీళ్లు ఓకె అనుకున్నా, వాళ్లు ఓకె అనకపోవడం ఇలా చాలా జరిగాయి.

కానీ తీరాచేసి వెళ్లిన 14 మందితో కిక్ రావడంలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొంతమందిని పంపుదాం అనుకున్నా ఎవ్వరూ సై అనడంలేదట. సగం ఎపిసోడ్ లు అయ్యాక వెళ్లడానికి గతంలో మంచులక్ష్మి, తేజస్విని సై అన్నారని వార్తలు వినవచ్చాయి. షో స్టార్ట్ అయ్యాక బిజీ ఏంకర్ అనసూయను అనుకున్నారు. ఆమె తాను బిజీ అని చెప్పేసింది. దాంతో వెదుకులాట మళ్లీ మొదటికి వచ్చింది.

దీనికి తోడు తెలుగు సినిమా జనాలకు స్టార్ట్ అయిన అరడజను ఎపిసోడ్ లు చూసిన తరువాత ఓ క్లారిటీ వచ్చింది. మేకప్ లేకుండా వుండడం, వంటలు చేయడం, గదులు ఊడ్వడం, ఎక్కువగా నిద్రపోకపోవడం, ఇలా చాలా నిబంధనలు తెలుగు సినిమా జనాలకు అస్సలు నచ్చడంలేదని వినికిడి.

ఇప్పటికే తాము గతిలేక రాలేదని, సిగరెట్లు ఇవ్వం, బట్టలు ఇవ్వం ఇలా శిక్షలేమిటని షోలో పాల్గొంటున్న శివబాలాజీ చికాకు పడిపోయాడు. ఇప్పుడు లోపలికి వెళ్తే ఇలాంటి తలకాయ నొప్పులు చాలా వుంటాయని సినిమా జనాలు అనుకుంటున్నారు. అందుకే వారానికి యాభైవేల నుంచి లక్షల్లో తమ స్థాయికి తగినట్లు ఇవ్వడానికి ఆఫర్లు వచ్చినా వెళ్లడానికి విముఖత చూపిస్తున్నారట. 

దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి జనాల వేట ముమ్మరంగా సాగుతోందని వినికిడి. ఏమిటో, మా కాస్తా స్టార్ మాగా మారిన తరువాత షోల హడావుడి ఎక్కువ వుంది కానీ, విజయాలు వరించడంలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?