Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బిగ్ బాస్ స్టేజ్ మీద డీఎస్పీ డ్యాన్స్?

బిగ్ బాస్ స్టేజ్ మీద డీఎస్పీ డ్యాన్స్?

బిగ్ బాస్ ఫైనల్ రేపే. ఈ ఆదివారం చిన్నతెరపై పెద్ద హడావుడే వుంటుంది. ఫైనల్ కార్యక్రమానికి సెలబ్రిటీలు ఎవరు హాజరవుతారన్న సస్సెన్స్ వుండనే వుంది. నాగార్జున, చిరంజీవి లాంటి వారిని తీసుకువస్తారని గతంలో వార్తలు వినిపించాయి.

బాలీవుడ్ బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ను తీసుకువస్తారేమో అన్న టాక్ వినిపించింది కూడా. కానీ ఆ తరువాత ఎవ్వరూ రారు, ఎన్టీఆర్ మాత్రమే వుంటారనీ వార్తలు వినవచ్చాయి.

అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్నదేమిటంటే, ఫైనల్ డే నాడు స్టేజ్ మీద యువ సంగీత సంచలన దేవీ శ్రీ ప్రసాద్ డ్యాన్స్ అండ్ లైవ్ ఫెర్ ఫార్మెన్స్ వుంటుందని. ఈ మేరకు ప్రోగ్రామ్ ఫిక్సయిందని తెలుస్తోంది. అయితే ఇంతవరకు దీనికి సంబంధించి ఎటువంటి ప్రోమో ఇంకా విడుదల కాలేదు. బహుశా ఈ రోజు షూట్ చేస్తే కనుక, నైట్ కు ప్రోమో వస్తుందని అనుకోవాలి.

అసలే ఫైనల్ కార్యక్రమం, జనాలకు భయంకరమైన ఆసక్తి వుంది. ఇక అలాంటిది డిఎస్పీ లైవ్ షో అంటే ఇక కొత్త టీఆర్పీ రికార్డులు వస్తాయేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?