Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

క్లైమాక్స్ తో 'పైసా వసూల్' గ్యారెంటీ అట

క్లైమాక్స్ తో 'పైసా వసూల్' గ్యారెంటీ అట

హీరోహీరోయిన్లతో రెయిన్ సాంగ్స్ పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు దర్శకులు. కానీ దర్శకుడు పూరిజగన్నాథ్ మాత్రం బాలయ్య కోసం ఏకంగా రెయిన్ ఫైట్ పెట్టాడు. అది కూడా ఫారిన్ ఫైట్ మాస్టర్స్ కంపోజిషన్ లో వస్తున్న రెయిన్ ఫైట్ ఇది. తాజాగా పోర్చుగల్ లో ఈ ఫైట్ సీక్వెన్స్ కంప్లీట్ చేశారు.

ఇద్దరమ్మాయిలతో సినిమాలో ఓ డిఫరెంట్ ఫైట్ పెట్టాడు పూరిజగన్నాథ్. చైనా ఫైట్ మాస్టర్స్ నేతృత్వంలో పిక్చరైజ్ చేసిన ఆ ఫైట్.. సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వస్తుంది. ఆ ఫైట్ లో బాకుతో విలన్లను ఎడాపెడా పొడిచేస్తుంటాడు హీరో.

అప్పట్లో ఆ ఫైట్ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది. ఇప్పుడు పైసా వసూల్ మూవీలో కూడా అలాంటి ఓ కొత్త ప్రయత్నం చేశాడట పూరిజగన్నాథ్. అదే రెయిన్ ఫైట్. కచ్చితంగా ఈ ఫైట్ అందరికీ నచ్చుతుందంటున్నాడు పూరిజగన్నాథ్.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెయిన్ ఫైట్ తో పాటు మరిన్ని ప్రత్యేకతలున్నాయని అంటున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ముస్కాన్ అనే హీరోయిన్ ఫొటోల్ని తాజాగా విడుదల చేశారు. శ్రియ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మూవీని సెప్టెంబర్ 29న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?