Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బిగ్‌బాస్‌ బిజీ ఆర్టిస్టులకి కాదు

బిగ్‌బాస్‌ బిజీ ఆర్టిస్టులకి కాదు

ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేస్తున్న షో అనేసరికి 'బిగ్‌బాస్‌'లో బాగా క్రేజ్‌ వున్న పర్సనాలిటీస్‌ పార్టిసిపేట్‌ చేస్తారని అనుకున్నారు. అయితే బిగ్‌బాస్‌ ఫస్ట్‌ సీజన్‌ కంటెస్టెంట్స్‌లో సీజన్డ్‌ ఆర్టిస్టులు ఎవరూ లేరు. అరకొర పాత్రలు పోషించే నటీనటులు, బిజీగా లేని సింగర్స్‌ తప్ప ఊపుమీదున్న వాళ్లెవరూ లేరు.

ఆర్టిస్టుల కోసం ఎంత ఇవ్వడానికైనా బిగ్‌బాస్‌ నిర్వాహకులు రెడీగా ఉన్నప్పటికీ డెబ్బయ్‌ రోజుల పాటు పనులన్నీ మానేసి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. బిజీ ఆర్టిస్టులు అందరూ కూడా అన్ని రోజులు ఇతర పనులు మానేయాలంటే కుదరదని అనేస్తున్నారు. అందుకే టాప్‌ యాక్టర్ల నుంచి యాంకర్ల వరకు అందరూ బిగ్‌బాస్‌ని రిజెక్ట్‌ చేసారు.

దీంతో అందుబాటులో వున్న ఆప్షన్స్‌తోనే షో రసవత్తరంగా నడిపించడానికి కృషి చేస్తున్నారు. తెలిసిన ముఖాల మధ్య అస్సలు తెలియని వారిని చేర్చడంలోను స్ట్రాటజీ వుందట. వారెవరనేది అస్సలు తెలియనపుడు వారి గురించి ఒక అంచనాకి రావడానికి ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. ఆ కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ చేయడానికే కొందరు ఊరు పేరు లేని వాళ్లని సైతం తీసుకున్నారట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?