Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బికినీలో కాజల్‌.. నిజమేనా.?

అందాల చందమామ కాజల్‌ తమిళంలో జీవా సరసన ఓ సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. 'కోవలై వెండామ్‌' పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం తొలిసారిగా కాజల్‌ టూ పీస్‌ బికినీలో కన్పించబోతోందట. కాజల్‌ బికినీ ఎపిసోడ్‌కి టీజర్‌గా ఆన్‌ లొకేషన్‌ స్టిల్స్‌ కొన్నిటిని సినిమా యూనిట్‌ విడుదల చేసింది. 

స్విమ్మింగ్‌ పూల్‌లో షూటింగ్‌ సందర్భంగా తీసిన ఆ స్టిల్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి. టాలీవుడ్‌లో ఎన్నిసార్లు బికినీ ఆఫర్‌ వచ్చినా, కాజల్‌ సున్నితంగా తిరస్కరించేసింది. ఓవర్‌ డోస్‌ ఎక్స్‌పోజింగ్‌ విషయంలో కాజల్‌ ఇప్పటికే చెయ్యాల్సిందంతా చేసేసినా, బికినీ గ్లామర్‌కి మాత్రం 'నై' అనేసిన విషయం విదితమే. మరి ఇప్పుడెందుకు కాజల్‌ బికినీకి 'సై' అనేసింది.? ఇప్పుడు ఇదే ప్రశ్న చర్చనీయాంశమవుతోంది. 

'అదసలు బికినీనే కాదు.. బికినీని తలపించే కాస్ట్యూమ్‌ అంతే..' అంటూ 'కోవలై వెండామ్‌' చిత్ర యూనిట్‌ సభ్యులు కొందరు చెబుతున్నారట. స్విమ్మింగ్‌ పూల్‌లో బికినీ కాక, ఇంకే కాస్ట్యూమ్‌ వుంటుంది.? అన్న ప్రశ్న పై ఫొటోల్ని చూపిస్తూ వేస్తున్నారు ఇంకొందరు. అసలు అది బికినీయేనా.? కాదా.? అన్న విషయమై క్లారిటీ రావాలంటే సినిమా విడుదలవ్వాల్సిందే. 

అన్నట్టు, ఈ మధ్య వరుస వైఫల్యాలు చవిచూసిన కాజల్‌, అవకాశాల కోసం గ్లామర్‌ విషయంలో హద్దులు దాటడానికైనాసరే 'సై' అనేస్తోందట. దానికి నిదర్శనం ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్‌లో కాజల్‌, మేగ్జిమమ్‌ క్లీవేజ్‌ని ప్రదర్శించడమేనని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?