Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాబీకి అక్కడా సేమ్ సీన్?

బాబీకి అక్కడా సేమ్ సీన్?

పవర్ లాంటి హిట్ ఇచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరక్ట్ చేసే అవకాశం పట్టుకున్న డైరక్టర్ బాబి కి అక్కడ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పవన్ కళ్యాణే కర్త, కర్మ,క్రియ అయిపోయి, అన్నీ తానే డిసైడ్ చేసేసి, తన సీన్లు తానే చేసుకుని, ఓ కో డైరక్టర్ గానో, సెకెండ్ యూనిట్ డైరక్టర్ గానో బాబీని మార్చేసారు.

మొత్తానికి ఆ సినిమా పూర్తయి, ఢమాల్ మంది. ఆ తరువాత పాపం, బాబీకి ఎవరు చాన్స్ ఇస్తారు? అని అనుకుంటూంటే, ఎన్టీఆర్ ముందుకు వచ్చారు. బాబీ లక్కీనే అనుకుంటే, అక్కడా సీన్ రిపీట్ అవుతోందని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన ప్రతి నిర్ణయం ఇప్పుడు ఎన్టీఆర్ నే తీసుకుంటున్నారట. 

బాలీవుడ్ నుంచి సినిమాటోగ్రాఫర్ ను తీసుకురావడం, దేవీని ఫిక్స్ చేయడం ఇలా అన్నీ. అదే విధంగా స్క్రిప్ట్ కు అనుగుణంగా స్టార్ కాస్ట్ అంతా ఎన్టీఆర్ నే డిసైడ్ చేస్తుంటే పక్కనుండి ఊ.. కొట్టడమే బాబీ పనవుతోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ బాబీకి ఓ ప్లస్ పాయింట్ వుండే అవకాశం వుంది. పవన్ సినిమాలో ఆయన డైరక్షన్ లో కూడా వేలు పెడతారు. ఇక్కడ ఎన్టీఆర్ ఆ పని చేయకపోవచ్చు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?