Advertisement


Home > Movies - Movie Gossip
2.0 ఎఫెక్ట్: బాలీవుడ్ లో కూడా బాధలు

ఏప్రిల్ లో వస్తున్నామంటూ 2.0మేకర్స్ చేసిన ప్రకటన బాలీవుడ్ లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. టాలీవుడ్ లానే బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలపై 2.0ఎఫెక్ట్ పడబోతోంది. వీటిలో ముఖ్యమైనది మణికర్నిక. క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టును ఏప్రిల్ 27న విడుదల చేయబోతున్నట్టు లాంఛింగ్ రోజునే ప్రకటించారు. ఇప్పుడు అదే తేదీకి వస్తున్నామంటున్నారు 2.0 మేకర్స్. 

మరోవైపు బాగి-2అనే బాలీవుడ్ మూవీతో పాటు ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అనే ఇంగ్లిష్ సినిమాపై కూడా 2.0ప్రభావం పడనుంది. జాకీష్రాఫ్ కొడుకు టైగర్ షరాఫ్ హీరోగా తెరకెక్కిన బాగి-2 సినిమా కూడా ఏప్రిల్ 27న వస్తోంది. ఉత్తరాదిన బి, సి సెంటర్లలో 2.0 నుంచి బాగి-2కు పోటీ తప్పదు. 

అటు మణికర్నిక సినిమాకు మాత్రం బి సెంటర్స్ తో పాటు మల్టీప్లెక్సుల నుంచి కూడా 2.0తో పోటీ తప్పేలా లేదు. ఇక ఎవెంజర్స్ విషయానికొస్తే.. దీనికి కూడా మల్టీప్లెక్సుల్లో రజనీకాంత్ మూవీ పోటీ ఇవ్వనుంది. పైగా త్రీడీలో కూడా తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. ఆ విభాగంలో కూడా ఎవెంజర్స్ కు 2.0 నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చు. 

రజనీకాంత్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన సినిమా కావడంతో.. 2.0ను బాలీవుడ్ లో భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. మిగతా నిర్మాతల్ని చిక్కుల్లోకి నెట్టిన మెయిన్ పాయింట్ ఇదే. ఈ మేరకు రజనీ-అక్షయ్ కుమార్ సినిమాపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (ఐఎఫ్ టీపీసీ)లో ఫిర్యాదు చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు కూడా సిద్ధమౌతున్నారు.