Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలీవుడ్ పై మహేశ్ బాబు కన్ను..!

బాలీవుడ్ పై మహేశ్ బాబు కన్ను..!

మహేశ్ బాబు హిందీ చిత్ర పరిశ్రమ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ మధ్య కొంచెం తక్కువే కానీ.. పోకిరి విడుదల అయిన కొత్త లో మహేశ్ బాలీవుడ్ సినిమా గురించి చాలా వార్తలే వచ్చాయి. అంతా అయిపోయింది.. పోకిరీని హిందీలో రీమేక్ చేయడం ద్వారా మహేశ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది.

అయితే ఏమైందో కానీ.. ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. మరి మహేశ్ హిందీలో చేయడం అనేది ఎప్పటికి జరుగుతుందో కానీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో టెక్నీషియన్లతో పనిచేయడం మాత్రం జరుగుతోంది. ఈ హీరో తాజా సినిమా కు బాలీవుడ్ నృత్య దర్శక ద్వయం బాస్కో- సీజర్ లు పనిచేస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ హీరోగా ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. దీని సాంగ్స్ కంపొజిషన్ కోసం బాస్కో- సీజర్ లను ప్రత్యేకంగా రప్పించుకొంటున్నారు. బాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ హీరోల సినిమాల్లో వీళ్లిద్దరి మార్కు తప్పనిసరి. హీరోల బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగానే అదుర్స్ అనే డాన్స్ కంపోజ్ చేయడంలో వీళ్లిద్దరికీ తిరుగులేదనే పేరుంది. 

ఇటీవలి శంకర్ సినిమా 'ఐ'కు నృత్యరీతులనిచ్చారు వీళ్లు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు సినిమాకు కూడా  బాస్కో సీజర్ లు పనిచేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీతలు కూడా అయిన ఈ నృత్యద్వయం  ప్రిన్స్ కోసం ఎలా డాన్స్ ను కంపోజ్ చేస్తుందో చూడాలి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?