Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బొమ్మ రేంజ్‌ పెంచేసిన బన్నీ!

బొమ్మ రేంజ్‌ పెంచేసిన బన్నీ!

రుద్రమదేవి చిత్రంలో ‘గోన గన్నారెడ్డి’గా స్పెషల్‌ క్యారెక్టర్‌ చేసిన అల్లు అర్జున్‌ ఆ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అయిపోయాడు. అతను ఈ చిత్రంలో నటిస్తున్నాడని తెలియగానే బిజినెస్‌ జోరుగా జరిగింది. అల్లు అర్జున్‌ నమ్మకంగా ఒక సినిమా టేకప్‌ చేయడంతో అతని ట్రాక్‌ రికార్డ్‌ తెలిసిన బయ్యర్లు ఈ చిత్రంపై భారీగానే ఖర్చు పెడుతున్నారు.

ఈ చిత్రంలో బన్నీ లుక్‌ని శుక్రవారం రివీల్‌ చేసారు. గోన గన్నారెడ్డి గెటప్‌లో బన్నీ చాలా బాగున్నాడు. సినిమా రేంజ్‌ పెంచే విధంగా ఈ చిత్రంలో బన్నీ లుక్‌ ఉందని కితాబులు వస్తున్నాయి. ఇందులో బన్నీ క్యారెక్టర్‌ ఇరవై నిముషాల పాటు ఉంటుందట. పెదరాయుడులో రజనీకాంత్‌ క్యారెక్టర్‌ రేంజ్‌లో ఎలివేషన్‌ ఉంటుందట.

మొదట్లో దీనిని కేవలం లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా చూసిన వారు కూడా ఇప్పుడు దీనిని పెద్ద సినిమాగా ట్రీట్‌ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ ఎంట్రీతో ప్రాజెక్ట్‌ కలరే మారిపోయింది. మహేష్‌, ఎన్టీఆర్‌ ఇద్దరూ కాదన్న ఈ క్యారెక్టర్‌ని బన్నీ దక్కించుకున్నాడు. గుణశేఖర్‌ ఈ చిత్రంతో మళ్లీ బౌన్‌ బ్యాక్‌ అయి స్టార్‌ డైరెక్టర్‌ అనిపించుకోవాలని చూస్తున్నాడు.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?