Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బోయపాటికి గ్యాప్ తప్పదా?

బోయపాటికి గ్యాప్ తప్పదా?

రామ్ చరణ్-బోయపాటి సినిమా పక్కా అని వార్తలు వచ్చేసాయి. మరోపక్క బోయపాటితో సినిమా వద్దని రామ్ చరణ్ అభిమానులు వత్తిడి చేస్తున్నారన్న వార్తలూ వినవచ్చాయి. అయితే రామ్ చరణ్ సూత్ర ప్రాయంగా ఊ అన్నారే తప్ప, ఇంకా అసలు కథ స్టార్ట్ కాలేదనీ వార్తలు వినివస్తున్నాయి. అయితే దర్శకుడు బోయపాటి మాత్రం ఎలాగైనా చరణ్ తో సినిమా చేయాలని పట్టుదలతో వున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం చరణ్ అయితే రంగస్థలం 1985 మీదనే దృష్టి పెట్టాడట. అది తప్ప మరే విషయం ఇంకా సీరియస్ గా డిస్కస్ చేయడం లేదని తెలుస్తోంది. కొరటాల శివ సినిమా ఏ విషయమూ తేలిన తరువాతే బోయపాటి సినిమాపై పక్కా నిర్ణయం వుంటుందని తెలుస్తోంది. కొరటాల శివ సినిమా విడుదల సంక్రాంతికి లేకపోయినా, ఫిబ్రవరి నాటికి కొరటాల శివ ఫ్రీ అవుతారని, అందువల్ల చరణ్ సినిమా అతనితోనే వుంటుందనీ వార్తలు కూడా వినివస్తున్నాయి.

మొత్తానికి చూస్తుంటే బోయపాటికి ఇప్పట్లో సినిమా వుండేలా కనిపించడంలేదు. బాలయ్య సినిమా వుంటుందేమో అనుకుంటే, బయోపిక్ వచ్చి పడింది. జనవరి తరువాత బాలయ్య ఫ్రీనే. కానీ బయోపిక్ లోపల బోయపాటితో సినిమా చేసే ఉద్దేశం ఉందో లేదో తెలియదు. మరే హీరో కూడా అందుబాటులో లేరు. మొత్తంమీద చూసుకుంటే బోయపాటికి కాస్త పెద్ద గ్యాప్ వచ్చేస్తుందేమో? చరణ్ డేట్ లు రాకపోతే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?