Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బోయపాటికి ఎన్టీఆర్ పై ఆసక్తి పోయిందా?

బోయపాటికి ఎన్టీఆర్ పై ఆసక్తి పోయిందా?

బోయపాటి లాంటి బలమైన డైరక్టర్, ఎన్టీఆర్ లాంటి సత్తా వున్న నటుడు కలిస్తే, ఆ రేంజ్ వేరుగా వుంటుంది. దమ్ము సినిమా స్క్రిప్ట్ పరంగా విఫలమై వుండొచ్చు కానీ, అప్పట్లో దానికి వచ్చిన రేంజ్ వేరు. అయితే మళ్లీ ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. ఆ సినిమా విడుదలై అయిదేళ్లు అయిపోయింది.

ఆ తరువాత మళ్లీ ఈ కాంబినేషన్ మీద ఎవరూ దృష్టి సారించలేదు. ఒక సినిమా విఫలమైంది కానీ, ఇటు ఎన్టీఆర్ విపలం కాలేదు, అటు బోయపాటి విఫలం కాలేదు. కానీ మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ చేసే ప్రయత్నం జరగలేదు.

బాబీ విఫలమైనా ఎన్టీఆర్ చాన్స్ ఇచ్చాడు. సంతోష్ శ్రీనివాస్ విఫలమైనా పవన్ చాన్స్ ఇచ్చాడు. మరి బోయపాటి-ఎన్టీఆర్ కాంబినేషన్ ఎందుకు పాజిబుల్ కావడం లేదు?

బాలయ్యకు, తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ కు వున్న ఎడమే, ఈ కాంబినేషన్ సెట్ కావడానికి అడ్డంగా వున్నట్లు తెలుస్తోంది. మెగా హీరోలు, మహేష్ బాబు, బాలయ్య ఇలా అందరి కాంబినేషన్ లకు కథలు సెట్ చేసుకుంటున్న, బోయపాటి ఎన్టీఆర్ కాంబినేషన్ కు మాత్రం ఎందుకు దూరంగా వుంటున్నారో మరి? దీనికి కారణం బాలయ్యతో బోయపాటికి వున్న అనుబంధమే కావచ్చు అని తెలుస్తోంది. ఒకరిద్దరు ఎన్టీఆర్-బోయపాటి కాంబినేషన్ ను సెట్ చేయాలని అనుకున్నా, బోయపాటి ఆసక్తి కనబర్చలేదని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?