Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బ్రహ్మోత్సవం సెటిలైపోయింది

బ్రహ్మోత్సవం ఈ ఏడాది నిరాశపర్చిన సినిమాల్లో ఒకటి. ఈ సినిమా వల్ల బయ్యర్లు లాస్ అయ్యారు. మరి తరువాత ఏం జరిగింది? ఆ వ్యవహారం ఎలా ముగిసింది అన్న దానిపై లేటెస్ట్ అప్ డేట్స్ ఇవి.

ఆ సినిమా విడుదలకు ముందు మహేష్ కు లాభాల్లో వాటాగా పివిపి అయిదు కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో ముందుగా మహేష్ కు పార్టనర్ షిప్ వుండేది. కానీ తరువాత వదులుకున్నారు. ఆ వ్యవహారం సెటిల్ మెంట్ లో భాగంగానే ఈ అయిదుకోట్లు ఇచ్చినట్లు వినికిడి. 

సినిమా ఫలితం తేడా వచ్చిన తరువాత మహేష్ బాబు పిలిచి మరీ తనకు లాభంగా ఇచ్చిన అయిదు కోట్లు వెనక్కు ఇస్తానని పివిపి కి చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాకు లాభాలు రాలేదు కాబట్టి, ఇక అలా తీసుకోవడం సరి కాదని మహేష్ భావించినట్లు తెలుస్తోంది. అలా ఇచ్చే మొత్తం బయ్యర్లకు అడ్జస్ట్ చేయాలన్నది మహేష్ ఆలోచన కావచ్చు. 

అయితే మురగదాస్, కొరటాల శివ సినిమాల తరువాత మహేష్ సినిమా మరొకటి పివిపి బ్యానర్ లో వుంది. వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇచ్చిన మొత్తం వెనక్కు తీసుకోవడం భావ్యం కాదని పివిపి నిరాకరించినట్లు వినికిడి. అందువల్ల మొత్తం బయ్యర్లతో పివిపి నేరుగా సంప్రదించినట్లు తెలుస్తోంది. అసలు ఎవరెవరు ఈసినిమాను ఏ లెవెల్ వరకు అమ్మారు. కింద లెవెల్ లో ఎవరు కొన్నారు. ఎవరికి ఎంత లాస్ వచ్చింది అన్న వివరాలు అన్నీ పివిపి సేకరించినట్లు బోగట్టా. 

తాను మహేష్ తో చేయబోయే సినిమాను, ఆ వేళ మహేష్ సినిమాల రేట్లకు 20 పర్సంట్ తక్కువకు ఇస్తానని, బయ్యర్లు అదే విధంగా, బ్రహ్మోత్సవం కొన్నవారికి 20 పర్సంట్ తక్కువ కు ఇవ్వాలని, ఆ విధంగా ఇప్పటి నష్టాలు  పూడుస్తానని పివిపి వివరించినట్లు తెలుస్తోంది. దానికి బయ్యర్లు ఓకె అన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బ్రహ్మోత్సవం వ్యవహారం ఆ విధంగా సద్దుమణిగింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?