Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మలయాళీల రుణం అలా తీర్చుకుంటాడట

మలయాళీల రుణం అలా తీర్చుకుంటాడట

హీరోలంతా కుదిరితే కోలీవుడ్ లో సినిమా చేయాలనుకుంటారు. తద్వారా తెలుగుతో పాటు తమిళ్ లో మార్కెట్ పెంచుకోవాలని చూస్తారు. కానీ బన్నీ మాత్రం మలయాళంలో సినిమా చేస్తానంటున్నాడు. అది కూడా మార్కెట్ పెంచుకోవడానికి కాదు. మలయాళీల రుణం తీర్చుకోవడానికి.

అల్లు అర్జున్ కు కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో అతడి సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా.. మల్లూవుడ్ లో మాత్రం మినిమం వసూళ్లు గ్యారెంటీ. బన్నీ లేటెస్ట్ మూవీ సరైనోడు సినిమాకు కూడా కేరళలో మంచి కలెక్షన్లు వచ్చాయి.

అలా తనపై ఎనలేని ప్రేమను కురిపిస్తున్న మలయాళీల రుణం తీర్చుకుంటానని, కచ్చితంగా ఓ స్ట్రయిట్ మలయాళీ సినిమా చేస్తానని అంటున్నాడు బన్నీ.

ఆ మధ్య కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించాడు బన్నీ. లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు. కాకపోతే ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.

ప్రస్తుతం తెలుగు సినిమాలపైనే పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తున్న అల్లువారబ్బాయ్.. మలయాళంలో నేరుగా సినిమా చేయడానికి ఎంత టైం తీసుకుంటాడో చూడాలి. అన్నట్టు.. బన్నీ లేటెస్ట్ మూవీ డీజేను కేరళలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?