Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ ఫేస్ కు ఏమయింది?

బన్నీ ఫేస్ కు ఏమయింది?

బన్నీ ఫేస్ కు ఏమయింది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రెండు రోజులుగా బన్నీ మొహానికి చిన్న మాస్క్ తో కనిపిస్తున్నాడని చూసిన వాళ్లు అంటున్నారు. ఫేస్ కు చిన్న స్కిన్ ఇన్ ఫెక్షన్ వచ్చిందని తెలుస్తోంది. అందుకే డిజె షూట్ కు విరామం ప్రకటించారని, దీని వల్ల ప్లస్ బాహుబలి ఎఫెక్ట్ ఎలా వుంటుందో అని, సినిమా విడుదలను ఏకంగా జూన్ కు తోసేసారని తెలుస్తోంది. 

జూన్ లో మహేష్ సినిమా వుంది. మరి దానికి ముందుగానో, వెనుకగానో ఈ సినిమా వుండే అవకాశం వుంది. ప్రస్తతానికి అయితే బన్నీ రెస్ట్ లో వున్నాడట రెండు రోజుల నుంచి, దీనికి కారణం మొహానికి సమస్య రావడమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

వాస్తవానికి ఈ సినిమాను మే విడుదల టార్గెట్ గా చకచకా రెడీ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇటు బాహబలికి అటు మహేష్ సినిమాకు మధ్యలో వచ్చిన గ్యాప్ ను వాడుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు బన్నీకి ఈ సమస్య రావడం, పైగా బాహుబలి-2 ఫీవర్ కాస్త గట్టిగానే వుంటుందని అనుకోవడంతో జూన్ కు వెళ్లాలని డిసైడ్ అయినట్లు బోగట్టా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?