Advertisement


Home > Movies - Movie Gossip
బన్నీకి డైరక్టర్ కావలెను

కాస్త ట్రాక్ రికార్డు వుండి, లైనో, స్క్రిప్ట్ నో రెడీగా వున్న దర్శకులు ఎవరైనా వుంటే బన్నీ దగ్గరకు వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం బన్నీ తన తరువాతి సినిమా డైరక్టర్ కోసం చూస్తున్నట్లు వినికిడి. వక్కంతం వంశీ తో సినిమా చేస్తున్న బన్నీ ఈ ఇయర్ ఎండ్ కు ఖాళీ అయిపోతారు. జనవరి, ఫిబ్రవరి నాటికి కొత్త సినిమా స్టార్ట్ చేయాలి. లింగుస్వామితో ద్విభాషా చిత్రం అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది మెటీరియలైజ్ అయ్యేలా లేదు.

ఎందుకంటే లింగుస్వామి ఖాళీ కావడానికి ఇంకా కనీసం ఆరు నెలలు పైగానే పడుతుంది. అదీ కాక, లింగు స్వామితో ఏసి డిసి ఆడే కన్నా, కాస్త మాంచి డైరక్టర్ తో, సరైన సినిమా చేయాలని బన్నీ భావిస్తున్నాడు. అందుకే ఎవరు దొరుకుతారా అని వెదుకులాట ప్రారంభమైంది. టాప్ లైన్ సూపర్ కమర్షియల్ డైరక్టర్లు ఎవ్వరూ ఖాళీ లేరు. అందుకే సక్సెస్ ట్రాక్ లో వున్న డైరక్టర్ ఎవరా అని వెదుకులాట ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

ఎవరు దొరుకుతారో చూడాలి. ఈలోగా ఎవరైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చేమో? బన్నీ ఇలా కన్ఫ్యూజన్ లో పడడం ఇది రెండో సారి. గతంలో సరైనోడు సినిమా తరువాత కూడా బన్నీ ఇదే విధంగా డైరక్టర్ కోసం వెదుకులాడాల్సి వచ్చింది. ఆఖరికి హరీష్ శంకర్ తో ఫిక్స్ అయి దువ్వాడజగన్నాధమ్ చేసారు.

బన్నీ ఇలా హరీష్ శంకర్, వక్కంతం వంశీ అనుకుంటే, అక్కడ ఎన్టీఆర్, మహేష్ లీడ్ డైరక్టర్లతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. బన్నీ క్యాంప్ లో సినిమాలు ఓకె అవడం, మెటీరియలైజ్ కావడం చాలా ఆలస్యం అవుతుందని, పైగా ఒక అంతట ఓకె చేయరని, బన్నీ, అరవింద్ ల ప్రమేయం ఎక్కవని టాక్ వుంది. ఈ కారణంగానే పెద్ద డైరక్టర్లు ఆ క్యాంప్ కు దూరంగా వుంటున్నారని వినికిడి.