Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కారు నేర్చుకున్నప్పుడు తెలిసింది అదేంటో

కారు నేర్చుకున్నప్పుడు తెలిసింది అదేంటో

ఎవరికైనా ఫస్ట్‌టైం రొమాంటిక్‌గా జరిగిన సంఘటనని ఎవరూ జీవితంలో మర్చిపోలేరు. అలాంటి అనుభవం తనకూ ఉందంటుంది హీరోయిన్‌, మోడల్‌ నర్గీస్‌ ఫక్రీ. టీనేజ్‌లో ఉండగా కారు డ్రైవింగ్‌ నేర్చుకోవడానికి ఒక డ్రైవింగ్‌ స్కూల్‌ని సంప్రదిస్తే ఎర్లీ మార్నింగ్‌ ఆరుగంటలకు టైం ఇచ్చారట. అప్పుడామెకు 17 ఏళ్లట. డ్రైవింగ్‌ నేర్పే కుర్రాడు తన పక్కనే కూర్చుని నేర్పడం, దగ్గరగా కూర్చోవడం, అతని లుక్స్‌ బలంగాఉన్న అతని చేతులూ, తనలో మొదటి సారి గుబులు రేపాయంటుంది. 

పైగా డ్రైవింగ్‌ కన్నా అతన్ని గమనించడమే సరిపోయేదట. అతనెంతో కూల్‌గా మరో ఉద్దేశ్యం లేకుండా డ్రైవింగ్‌ నేర్పేదట. అయితే తన మనసులోనే అలజడి మొదలయ్యిందని చెబుతుంది. అతను కొంత అడ్వాన్స్‌డ్‌ అయ్యుంటే నేను అప్పుడు బ్యాలెన్స్‌ తప్పేదాన్నేమో.. లక్కీగా 22 రోజుల్లో కోర్స్‌ పూర్తయ్యిపోయింది. లాస్ట్‌ టెన్‌డేస్‌ నాతో మా ఆంటీ కూడా రావడంతో ఆ ఎపిసోడ్‌ సేఫ్‌గా ఎండ్‌ అయ్యిందని చెబుతుంది నర్గీస్‌ ఫక్రీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?