Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సెన్సారు మేనేజ్ సాధ్యమా?

సెన్సారు మేనేజ్ సాధ్యమా?

బాహుబలి సెన్సారు విషయంలొ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుందంటూ వార్తలు బయటకు వచ్చాయి. సెన్సారు సభ్యుల్లో తమకు విశ్వాసపాత్రులైన వారిని, బాగా  నమ్మకస్తులును ఎంచుకుని సినిమా చూపించారని, అలాగే సినిమా వేసే ఆపరేటర్లను కూడా ఎంచుకున్నారని వార్తలు బయటకు వచ్చాయి.

కానీ ఇలా చేయడం సాధ్యమేనా అన్నది అనుమానం. ఏయే సభ్యులు సినిమా చూడాలన్నది నిర్మాత డిసైడ్ చేయగలరా? ఏ ఆపరేటర్ సినిమా వేయాలన్నది నిర్మాత నిర్ణయించగలరా? అలా చేయగలిగితే ఇక సెన్సారు బోర్డు ఎందుకు? సెన్సారు అధికారి ఎందుకు? ప్రతి సినిమాకు ఇలా మేనేజ్ చేసి, కట్ లు లేకుండా, తమకు నచ్చిన సర్టిఫికెట్ తెచ్చేసుకోవచ్చు కదా?

మరి బాహుబలి యూనిట్ ఇలా చేసింది అంటే, అదే నిజమే అయితే కనుక ఎలా సాధ్యమైంది అన్నది అనుమానంగా వుంది. సెన్సార్ అధికారులు తాము చెప్పినట్లు వినేలా సినిమా నిర్మాతలు ఎలా చేయగలిగారు? ఏ విధంగా మేనేజ్ చేయగలిగారు? పై నుంచి రాజకీయ పలుకుబడి ఏమైనా వాడారా? ఎందుకంటే సినిమాను ఏ సభ్యులు చూడాలన్నది వంతుల వారీ పద్దతిన సెన్సారు ప్రాంతీయ అధికారి నిర్ణయిస్తారు. సభ్యలు ఎవరు అన్నది తెలుసుకుని, వాళ్లలో వీరే మా సినిమా చూసేలా చేయండి అని ప్రాంతీయ అధికారిని మేనేజ్ చేయలిగారు బాహుబలి టీమ్ అంటూ గ్యాసిప్ లు వెలువడ్డాయి. అలాగే సినిమా వేసే ఆపరేటర్లను కూడా యూనిట్ డిసైడ్ చేసిందని, ఇదంతా రాజమౌళి చాకచక్యం, మేనేజ్ మెంట్ అంటూ ఆ గ్యాసిప్ ల్లో గాల్లోకి ఎత్తుతున్నారు.

దీన్ని చాకచక్యం అనరు. పలుకుబడి, లేదా మరే విధమైన మార్గాలు వాడడం అంటారు. దీనికి సెన్సారు అధికారులు లొంగారు అంటే అది కాస్త ఆలోచించాల్సిన విషయమే. బాహుబలి సెన్సారు రెండు మూడు రోజుల క్రితం ముగిసింది. ఈ రోజు సర్టిఫికెట్ వస్తోంది. సర్టిఫికెట్ బయటకు వచ్చింది అంటే ఎవరు చూసారు అన్నది తెలుస్తోంది. ఎందుకంటే వారి పేర్లు సర్టిఫికెట్ మీద వుంటాయి. అప్పుడు తెలుస్తుంది. బాహుబలి టీమ్ కు లాయలిస్ట్ లు ఎవరు అన్నది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?