Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చైతూ దృష్టి అటు మళ్లింది

చైతూ దృష్టి అటు మళ్లింది

నాగ చైతన్య ఫీల్ లవ్ సినిమాలను ఇష్టపడుతున్నట్లుంది. ఏమాయ చేసావె సూపర్ హిట్. ఇప్పుడు మళ్లీ అదే డైరక్టర్ వాసుదేవ గౌతమ్ మీనన్ డైరక్షన్ లో చేస్తున్నాడు. మరోపక్క ఇంకో సినిమాపై కన్నేసాడు. అదీ అలాంటిదే. మళయాలంలో హిట్ అయిన ప్రేమమ్ సినిమా. ఈ సినిమాను తెలుగులో తాను హీరోగా చేయాలని అనుకుంటున్నాడు.

రీమేక్ హక్కుల కోసం నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) ప్రయత్నాలు మొదలయ్యాయి. హక్కులకు మళయాల నిర్మాతలు కాస్త ఎక్కువ రేటు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ తదితరులు చూసి, తెలుగు రీమేక్ వ్యవహారాలపై ఓ ఐడియాకు వచ్చారు. 

హక్కులు దొరికితే చైతూ హీరోగా చందు మొండేటి దర్శకుడిగా ప్రేమమ్ సినిమా తెరకెక్కుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?