Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చైతూ సినిమాకు కాస్ట్ కటింగ్

చైతూ సినిమాకు కాస్ట్ కటింగ్

నాగార్జున మాంచి నటుడే కాదు, మాంచి బిజినెస్ మాన్ కూడా. ఈ సంగతి కొత్తది కాదు. అందరికీ తెలిసిందే. చాలా ప్లానింగ్ గా, ఎక్కడా చేతికి తగలకుండా చూసుకుని సినిమాలు నిర్మిస్తాడు. మనం లాంటి ప్రెస్టీజియస్ సినిమా నిర్మించినా, ఓ తెగ ఆతృత పడిపోయి ఖర్చు పెట్టేయలేదు. 

ఇంతకీ లేటెస్ట్ విషయం ఏమిటంటే, నాగ్ చైతన్య హీరోగా సోగ్గాడే చిన్నినాయనా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో చేస్తున్న సినిమాను వీలయినంత తక్కువలో ఫినిష్ చేయమని నాగ్ చెప్పేసాడట. మినిమమ్ బడ్జెట్ నే ఈ సినిమాకు నాగ్ కేటాయించినట్లు తెలుస్తోంది. వీలయినంత తక్కువ ఖర్చులో ఎలా ఫినిష్ చేయగలరో, అలా చేయమని నాగ్ చెప్పినట్లు తెలుస్తోంది.

వైజాగ్ షెడ్యూలు పూర్తి చేసుకుని వచ్చిన దగ్గర నుంచి నానక్ రామ్ గూడలో షూటింగ్ జరుగుతోంది. వీలయినంత వరకు అక్కడ వున్న ఫెసిలిటీస్ వాడుకుని, కొత్ సెట్లు గట్రా లేకుండా తక్కువలో ముందుకు వెళ్లమని చెప్పాడట నాగ్. చైతన్య మార్గెట్ ఎంత వుందో నాగ్ కు తెలియంది కాదు. అందుకే దానికి తగినట్లే ఖర్చు చేయాలని అనుకుని ఇలా ప్లాన్ చేసి వుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?