Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చైతూ సినిమాకు నిర్మాత కావలెను

చైతూ సినిమాకు నిర్మాత కావలెను

నాగ్ చైతన్య మీడియం రేంజ్ హీరో. అలాంటి హీరోతో సినిమా అంటే ఏ నిర్మాత రెడీగా వుండడు? పైగా కార్తికేయ, ప్రేమమ్ అంటూ రెండు వరుస హిట్ లు ఇచ్చిన డైరక్టర్ చందు మొండేటి కాంబినేషన్. మరింక లోటేముంది? అయినా కూడా ఇంకా నిర్మాత ఫిక్స్ కాలేదట. వాస్తవానికి ఐ డ్రీమ్ సంస్థ చందు మొండేటితో అగ్రిమెంట్ కుదర్చుకుంది. వాళ్లకి సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి రావడం లేదు.

నాగ్-నిఖిల్-చందు మొండేటి కాంబినేషన్ సినిమా అనుకున్నారు కానీ అది తాత్కాలికంగా పక్కన పెట్టి, చైతన్యతో సినిమా ఓకె చేసాడు నాగార్జున. కానీ నిర్మాతగా ఎవరు ఇంకా ఫిక్స్ కాలేదట. అన్నపూర్ణ సంస్థ ఇప్పటికే చైతన్యతో ఒకటి, ఆ తరువాత నాగ్ తో బంగార్రాజు, ఈలోగా అఖిల్-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లోఒకటి మూడు సినిమాలు చేస్తోంది. అందుకే ఈ సినిమాను బయటకు ఇద్దామనుకుంటున్నారు.

ఎవరు అన్నది సెట్ కావడం లేదు. హీరోకి ఓకె కావాలి. డైరక్టర్ కంఫర్ట్ గా వుండాలి. నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి? మరి ఇలా అన్నింటికి కలిసి ఎవరు సెట్ అవుతారో? సితార ఎంటర్ టైన్ మెంట్స్ అయితే రెడీగా వుంది నాగ్ చైతన్యతో సినిమా చేయాలని. అలాగే దిల్ రాజు కూడా చందు మొండేటితో సినిమా చేయాలని అనుకుంటున్నారు. మరి ప్రేమమ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందో, మరెవరు సీన్ లోకి వస్తారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?